English   

మరచిపోలేని జర్నీ ‘మహా సముద్రం’

Maha samudhram pre release event
2021-10-11 22:03:19

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ‘Rx 100’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “నాకు తెలుగు ప్రేక్షకులకు చాలా గ్యాప్ ఉందని విన్నాను. కానీ ఎలాంటి గ్యాప్ లేదని అర్థమవుతుంది. అందరికీ ఇష్టమైన మూవీ బొమ్మరిల్లు. నేటి టీనేజ్ పిల్లలు మీ పేరెంట్స్ ను అడగండి బొమ్మరిల్లునీ ఎంతగా ఇష్టపడ్డారో.. మొదట తెలుగు ప్రేక్షకులే నన్ను హీరోని చేశారు. నాకు వాళ్ళు ఒక సూర్యుడితో సమానం. వాళ్లే నాకు స్టార్డమ్ అనే వెలుగును ఇచ్చారు. ఇలాంటి వేడుక గురించి నేను తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను. అజయ్ భూపతిని నన్ను కలిపినందుకు జెమినీ కిరణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిర్మాత గారికి కూడా చాలా థాంక్స్. ఎందుకంటే ఆయన అన్న లాగా చూసుకున్నారు. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇండస్ట్రీల నుండి నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి.

ముందుగా దర్శకుడు అజయ్ భూపతిని పొగిడాలి. రాజ్ ఫోటోగ్రఫీ తర్వాత చేతన్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. హీరోయిన్స్ తో పాటు జగపతి బాబు రావు రమేష్ వంటి నటులు కూడా సినిమాలో అద్భుతంగా నటించారు కేవలం సినిమాల్లోనే కాకుండా సినిమా వెనుక కూడా వారి పాత్ర చాలానే ఉంది. ఈ సినిమాతో నాకు మంచి మిత్రులు దొరికారు. ముఖ్యంగా శర్వా నాకు దొరికాడు. అతనికి ఐ లవ్యూ చెబుతున్నాను. శర్వా వచ్చిన తరువాతే ఈ సినిమా స్థాయి పెరిగింది. అజయ్ భూపతి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇది నాకు ఒక రీ లాంచ్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. చాలా కాలం తరువాత అజయ్ నన్ను తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తున్నందుకు చాలా థాంక్యూ. ఈ సినిమాలో కొలవలేనంత ప్రేమ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని న‌మ్ముతున్నాను.. ఇక ఆక్టోబర్ 14న మనం థియేటర్స్ లో కలుద్దాం..అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. సిద్దార్థ్ ఈ సినిమా శర్వానంద్ సినిమా అని చెప్పాడు అందుకు నేను ఏమాత్రం ఒప్పుకోను. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.. అలానే మ‌హా సముద్రంలో కూడా కథ మాత్రమే హీరో. తప్పకుండా ఇది విడుదలయ్యాక తెలుగు సినిమారా అని అందరూ గర్వంగా చెబుతారు. రావు రమేష్ గారు మొదట ఈ కథ గురించి నాకు చెప్పారు. నేను కథ విన్నాక చేస్తాను అని చెప్పాను. అనిల్ సుంకర తో మాట్లాడిన తరువాత ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. మూడు రోజుల్లో సినిమా ఓకే అయిపోయింది. 9 మందితో కొనసాగే ఈ కథ చాలా బావుంటుంది. దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు అజయ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మహాసముద్రం సినిమా అనేది లవ్ స్టొరీ. ఎక్కువగా మహా పాత్ర‌ చుట్టే ఉంటుంది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. అదితి చాలా బాగా చేసింది. అను కూడా చాలా బాగా వర్క్ చేసింది. ఇక ఈ సినిమాతో సిద్దార్థ్ వంటి మంచి స్నేహితుడు దొరికాడు అని చెప్పడంతోనే సినిమా సక్సెస్ అని అర్థమైపోయింది. అందరూ శర్వా స్టార్ అన్నా కూడా వాడు ఎప్పటి నుంచో ఒక స్టార్. రంగ్ దే బసంతి, బొమ్మరిల్లు వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేసి హంబుల్ గా మాట్లాడుతున్నాడు. అదే అతని గొప్పతనం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆక్టోబర్ 14న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అంటే దసరాకు. ప్రతి పండగ సమయంలో నేను హిట్ కొట్టాను. ఇప్పుడు కూడా మహాసముద్రంతో హిట్ కొడుతున్నాం అన్నారు. 
 

More Related Stories