`తమసోమ జ్యోతిర్గమయ` ట్రైలర్ ని చూస్తే `వేదం` సినిమా గుర్తొస్తుంది!- డైరెక్టర్ క్రిష్

`తమసోమ జ్యోతిర్గమయ` ట్రైలర్ ని చూస్తే వేదం సినిమా గుర్తొస్తుందని అన్నారు సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో .. చేనేత, చేతి వృత్తులలో ప్రత్యేకంగా యువతలో సామాజిక స్పృహను కల్పించే విధంగా ఈ సినిమాని తెరకెక్కించారని అన్నారు. ట్రైలర్ లో “ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుంది“ అని ఆయన ప్రశంసించారు. `తమసోమ జ్యోతిర్గమయ- ఒక నేత కథ` ట్రైలర్ ఆవిష్కర్త క్రిష్ .. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయని అన్నారు.
ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే తదితరులు నటించారు. విజయ్ కుమార్ బడుగు దర్శకత్వం వహించారు. ఆయనే రచయిత. అక్టోబర్ 29న ఈ సినిమా విడుదలవుతోంది. గుణాస్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మించారు. ప్రశాంత్ బిజె సంగీతం అందించగా.. సాయి కార్తీక్ గౌడ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ చిత్రానికి DOP- ఎడిటింగ్- DI-శ్రావణ్ జి కుమార్. సాహిత్యం – పెద్దింటి అశోక్ కుమార్, ప్రశాంత్ BJ, సాయి చరణ్, రంజని శివ కుమార్.