English   

అక్కినేని గారి ఫ్యామిలీ తో మా జర్నీ ఇలాగే కొన సాగుతుంది -అల్లు అర్జున్

Allu Arjun About Akkineneni Family
2021-10-20 21:31:19

అక్కినేని అఖిల్ - పూజా హేగ్డే జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ ల్లో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు వంశీ పైడి పల్లి, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకొని ఇంత మంచి సినిమా తీసిన చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు కంగ్రాజులేషన్. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను. అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందని నా చిన్న సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని  ఒక  మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు. అందుకే ఈరోజు ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణమైంది.

తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. రియల్లీ అప్రిషియేట్. మా నాన్నగారు చెప్పినట్టు ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు గారు, మా తాత  అల్లు రామలింగయ్య గారు ఈ సక్సెస్ ను చూస్తుంటారు. అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది. లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య గారు, ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు. వీరిద్దరికీ కంగ్రాచులేషన్. పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను. సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా హార్డ్ వర్కర్, వాసు వర్మ ఈ సినిమాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. గోపి సుందర్ కి తెలుగు రాకపోయినా చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు.

బన్నీ వాసు మరొక బిగ్ హిట్ ని అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో బన్నీ వాసు ఇంత కష్టపడడం నేను చూడలేదు. మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటారు. మా ఫాదర్ పెద్ద, పెద్ద స్టార్ హీరోలతో, కొత్త వాళ్లతో తర్డ్ జనరేషన్ హీరోస్ తో ఇలా అందరితో పని చేస్తూ మంచి కథలతో బెస్ట్ మూవీస్ ఇస్తున్నారు. టీం అంతా ఎంతో కష్టపడి  మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూపించింది. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

More Related Stories