English   

రాధేశ్యామ్ టీజర్ వ్యూస్ పై క్లారిటీ ఇచ్చిన యూట్యూబ్.

youtube gave clarity on radhe shyam teaser views
2021-10-27 22:05:05

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటించిన భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ నుంచి అవైటెడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా టీజర్ రిలీజ్ చేసారో లేదో అలా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకొని టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా రికార్డు సెట్ చేసింది. అయితే..  63 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ టీజర్ తర్వాత 62 మిలియన్ వ్యూస్ గా చూపించింది యూట్యూబ్.

ఆతర్వాత మళ్లీ 63 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా చూపించింది. ఇలా ఎందుకు జరిగింది.? తక్కువ వ్యూస్ ఎందుకు చూపించారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్ డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని తర్వాత అప్ డేట్ చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు. దీనితో రాధే శ్యామ్ టీజర్ రెస్పాన్స్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఈ భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories