రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తె షూటింగ్ సమయంలో కరోనా కారణంగా అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఆయన హాస్పటల్ లో జాయిన్ కావడం కరోనా నుంచి బయటపడడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రజనీకాంత్ హాస్పటల్ లో జాయిన్ చేశారు. కుటుంబ సభ్యులు రెగ్యులర్ చెకప్ కోసమే అని చెబుతున్నప్పటికీ.. కాస్త సీరియస్ గా ఉందనే వార్త బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి రజనీకాంత్ అభిమానులలో ఆందోళన మొదలైంది.
ఇలా రజనీకాంత్ ఆరోగ్యంకి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా కావేరి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించినట్టు తెలిపారు. ఆ బ్లాక్స్‌ని తొలగిస్తున్నట్టుగా వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ కు రెస్పాండ్ అవుతున్నారు. ఎక్స్ పర్ట్స్ అయిన డాక్టర్ల సమక్షంలో ట్రీట్ మెంట్ జరుగుతుంది. త్వరలోనే రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేస్తామని ఓ బులెటిన్ ద్వారా తెలియచేశారు. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ నటించిన అన్నాత్తె మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకలు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.