English   

మణిశంకర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్.. మామూలుగా లేదుగా?

mani shankar
2021-11-01 19:11:19

 దర్శకుడు జీవీకే దర్శకత్వంలో శివ కంటమనేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మణిశంకర్. ఇందులో సంజన గల్రాని, ప్రియ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు జి వెంకట క్రిష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్ శంకరరావు ఆచార్య శ్రీనివాస్ రావు, అలాగే ఎం ఫణి భూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 ఇదిలా ఉంటే తాజాగా మణిశంకర్ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్ లో శివ కంఠమనేని ఉన్న క్రియేటివ్ మోషన్ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. నేడు విడుదల అయినా మా మణిశంకర్ టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి బాగా రెస్పాన్స్ వస్తోంది. సంజన,ప్రియ ల తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

 అలాగే దర్శకుడు జీవీకే మేకింగ్ చాలా కొత్తగా ఉంది అని తెలిపాడు. ఇక అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే అవుట్ పుట్ కూడా బాగానే వచ్చింది. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.

More Related Stories