English   

జ‌బ‌ర్ద‌స్థ్ అంటేనే వివాదాలా..?

2017-03-28 10:19:18

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్థ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు కామెడీ ప్రోగ్రామ్స్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జ‌బ‌ర్ద‌స్థ్. అయితే న‌వ్వించి ఎంత పాపుల‌ర్ అయిందో.. వివాదాల‌తోనూ అంతే ఫేమ‌స్ అయింది ఈ కార్య‌క్ర‌మం. ఇందులో క‌మెడియ‌న్లు చేస్తోన్న స్కిట్లు నిత్యం ఏదో ఓ సామాజిక వ‌ర్గాన్నో.. లేదంటే బ‌య‌ట వృత్తులు చేసుకునే వాళ్ల‌నో కించ‌ప‌రిచే విధంగా ఉంటున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అప్ప‌ట్లో క‌మెడియ‌న్ ధ‌న్ రాజ్ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై చేసిన ఓ స్కిట్ వివాదాస్ప‌ద‌మైంది. భ‌గ‌వ‌త్ గీత‌పై ప్ర‌మాణం చేయండి అంటూ ఒక‌టి కాదు నాలుగు గీత‌ల‌పై ప్ర‌మాణం చేస్తానంటూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను.. అత్యంత ప‌విత్ర‌మైన భ‌గ‌వ‌ద్గీత‌ను అవ‌మానించారంటూ కీరంన‌గ‌ర్ లోని హుజూరాబాద్ కోర్ట్ లో ఆ మ‌ధ్య కేస్ ఫైల్ అయింది.
దీనికి సంబంధించి జ‌బ‌ర్ద‌స్థ్ టీం మొత్తం క‌రీంన‌గ‌ర్ కోర్ట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో నాగ‌బాబు, రోజా, ధ‌న్ రాజ్, వేణు లాంటి వాళ్ళంతా కోర్టుకు వ‌చ్చారు. జ‌బ‌ర్ద‌స్థ్ టీం ఇలా వివాదాల్లో ఇరుక్కోవ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనే వేణు చేసిన ఓ క‌ళ్లు గీత కార్మికుడి స్కిట్ ఆ సామాజిక వ‌ర్గాన్ని బాగా హ‌ర్ట్ చేసింది. జూబ్లీహిల్స్ లో వేణుపై క‌ళ్లుగీత కార్మికుల సంఘం దాడి కూడా చేసింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాత కూడా చాలా స్కిట్లు వివాదాస్ప‌దం అయ్యాయి. ఇక ప్రోగ్రామ్ లో కూడా స్కిట్ల పేరుతో ప్రోమో షాట్స్ ను మరీ దారుణంగా క‌ట్ చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. డ‌బుల్ మీనింగ్ డైలాగులు హ‌ద్దులు మీరుతున్నాయి. ఇక 2017 మార్చ్ 30 కోసం క‌ట్ చేసిన ప్రోమోల్ నాగబాబు, రోజా సుధీర్ టీంపై ఫైర్ అయిన‌ట్లు చూపిస్తున్నారు. ఇది స్కిట్టా.. లేదంటే ప‌బ్లిసిటీ స్టంటా అనేది ఎపిసోడ్ ప్లే అయ్యేవ‌ర‌కు తెలియ‌దు. 
ఇక స్కిట్లు మాత్ర‌మే కాదు.. అందులో క‌మెడియ‌న్లు కూడా నిత్యం ఏదో ఓ వివాదంలో ఇరుక్కుంటున్నారు. మొన్న‌టికి మొన్న సుడిగాలి సుధీర్ చేసిన ర‌చ్చ అంత ఈజీగా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. జూబ్లీహిల్స్ లో త‌న కార్ ను ఢీ కొట్టార‌ని రోడ్డుపై ఓ వ్య‌క్తిపై నానా వీరంగం చేసాడు సుధీర్. వాళ్ళు హాస్పిట‌ల్ కు వెళ్తున్నామ‌ని.. కాళ్లు ప‌ట్టుకుని వేడుకున్నా ఆయ‌న క‌నిక‌రించలేదు. మీడియాను కూడా తిట్టాడు. ఆ మ‌ధ్య చ‌మ్మ‌క్ చంద్ర‌పై కూడా అమ్మాయిల‌ను వాడుకుంటాడ‌ని కొన్ని వార్త‌లొచ్చాయి. జ‌బ‌ర్ద‌స్థ్ లో జ‌నాన్ని న‌వ్వించే వీళ్లు.. బ‌య‌ట మాత్రం ఇంత‌లా రెచ్చిపోవ‌డం కొత్త చ‌ర్చ‌ల‌కు  దారిస్తోంది. 

More Related Stories