English   

బాల‌య్య సినిమా.. పూరీ క‌సి..

2017-03-28 03:34:19

అస‌లు స్టార్ హీరోలెవ‌రైనా ఇప్పుడు ప‌ట్టించుకుంటారా.. అస‌లు పూరీ జ‌గ‌న్నాథ్ కు ఇప్పుడు ఏ హీరోనైనా ఛాన్స్ ఇస్తాడా అనుకుంటోన్న టైమ్ లో పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు బాల‌కృష్ణ‌. గోడ‌కు కొట్టిన బంతిలా ఏకంగా బాల‌కృష్ణ‌తో సినిమా ఓకే చేయించుకున్నాడు పూరీ. ఇది త‌న స్టామినా అని త‌న‌ను వ‌ద్ద‌న్న హీరోల‌కు చెబుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఐదు రోజుల పాటు బాల‌య్య ఎంట్రీ సీన్ ను మాదాపూర్ లోని అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో చిత్రీక‌రించాడు పూరీ. ఆ త‌ర్వాత ఎప్రిల్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో 
బాల‌య్య‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు చూపించ‌నంత కొత్త‌గా చూపించ‌బోతున్నాడు పూరీ. 
పూరీ చెప్పిన క‌థ బాగా క‌నెక్ట‌వ్వ‌డంతో క‌మిటైన కేఎస్ ర‌వికుమార్ సినిమాను సైతం ప‌క్క‌న‌బెట్టేసి.. ఇమ్మీడియ‌ట్ గా పూరీ సినిమా స్టార్ట్ చేసాడు బాల‌య్య‌. మార్చ్ 16న మొద‌లైన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ ప్లానింగే ఇప్ప‌టి వ‌ర‌కు పూరీని ఇండ‌స్ట్రీలో బ‌తికిస్తూ వ‌స్తోంది. ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా ఓకే అయ్యేలా చేసింది. ఈ సినిమాతో బాల‌య్య జాత‌కం మారేదేమీ లేదు.. కానీ పూరికి మాత్రం అలా కాదు. చావో రేవో తేల్చుకోవాల్సిన సినిమా ఇది. అందుకే బాల‌య్య సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇది హిట్టైతే ఆటోమేటిక్ గా మ‌ళ్లీ స్టార్ హీరోలు వ‌చ్చేస్తారు. చూడాలి మ‌రి.. పూరీని బాల‌య్య ఏం చేస్తాడో..?

More Related Stories