English   

ప‌వ‌న్ చివ‌రి సినిమా ఆయ‌న‌తోనా..?

2017-03-28 03:45:59

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డం క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. 2019 ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ఇక‌పై తాను పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉంటాన‌ని కూడా స్ప‌ష్టం చేసాడు. తాను ప్ర‌స్తుతం న‌టిస్తున్న మూడు సినిమాలు పూర్తైన త‌ర్వాత సినిమాల‌కి బై చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో అన్న‌ట్లు మాట్లాడాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఇప్పుడు అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానం. ప‌వ‌న్ చివ‌రి సినిమా ఏంటి..? ప‌్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడు.
అందులో కాట‌మ‌రాయుడు ఇప్ప‌టికే విడుద‌ల‌కు సిద్ధ‌మైపోయింది. మార్చ్ 24న ఇది రానుంది. ఇక త్రివిక్ర‌మ్, నీస‌న్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో త్రివిక్ర‌మ్ సినిమానే ముందు మొదలు కానుంది. ఎప్రిల్లో షూటింగ్ మొద‌లుపెట్టి.. ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు నిర్మాత రాధాకృష్ణ‌. ఇక మూడోది నీస‌న్ ప్రాజెక్ట్. దీన్ని కూడా ఈ ఏడాదే మొద‌లుపెట్టి.. మ్యాగ్జిమ‌మ్ 2018 స‌మ్మ‌ర్ విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేస్తున్నాడు ప‌వ‌న్. 2018 త‌ర్వాత ప‌వ‌న్ ను ఇక సినిమాల్లో చూడటం క‌ష్ట‌మే. ఎన్నిక‌ల‌కు ఒకే ఏడాది టైమ్ ఉంటుంది కాబ‌ట్టి ఆయన అక్క‌డే ఫోక‌స్ చేస్తాడు. అంటే ఇప్పుడు లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే ప‌వ‌న్ చివ‌రి సినిమా నీస‌న్ తోనే అని తెలుస్తోంది. మ‌రి దీనికి ప‌వ‌న్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రానుందో..?

More Related Stories