English   

తెలుగు సినిమా శాటిలైట్. ఆకాశ‌మంతా..!

2017-03-28 03:53:45

శాటిలైట్ రైట్స్.. ఒక‌ప్పుడు సినిమా నిర్మాత‌ల‌కు ఇది ఓ అద‌న‌పు బ‌లం అంతే. సినిమా బ‌డ్జెట్ లో ప‌దో వంతు కూడా శాటిలైట్ రైట్స్ రూపంలో వ‌చ్చేవి కావు. కానీ గ‌త కొన్నేళ్లుగా కాలం మారిపోయింది. ఒక్కో సినిమా కోసం కోట్ల‌కు కోట్లు పోస్తున్నారు టీవీ ఛానెల్ ఓన‌ర్లు. త‌మ ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం నిర్మాత‌ల్ని కోట్ల‌ల్లో ముంచేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమా శాటిలైట్ రైట్స్ రేట్స్ ను చూస్తుంటే క‌ళ్ళు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. మొన్న‌టికి మొన్న ఖైదీ నెంబ‌ర్ 150 శాటిలైట్ రైట్స్ ను మాటీవీ 12 కోట్ల‌కు ద‌క్కించుకుంది. కాట‌మ‌రాయుడు రైట్స్ ను కూడా అదే ఛానెల్ 12.50 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అంతేకాదు.. మ‌హేశ్ మురుగ‌దాస్ సినిమా రెండు భాష‌ల రైట్స్ ను జీ టీవీ సంస్థ ఏకంగా 26 కోట్ల‌కు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు అని తేడా లేదు. క్రేజ్ ఉంటే చాలు కోట్లు ఇచ్చి మ‌రీ నిర్మాత‌ల్ని త‌డిపేస్తున్నారు. బాహుబ‌లి శాటిలైట్ రైట్స్ ని 14 కోట్ల‌కు కొంటే.. హిందీలో బాహుబ‌లి 2 రైట్స్ 52 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. మిగిలిన అన్ని భాష‌ల్లో క‌లిపితే కేవ‌లం శాటిలైట్ నుంచే బాహుబ‌లి 2 ఖాతాలోకి 150 కోట్ల‌కు పైగా వ‌చ్చేసాయి. మిగిలిన హీరోల‌కు కూడా రేంజ్ ఇలాగే ఉంది. సినిమాను బ‌ట్టి రేట్ అన్న‌ట్లు ఒక్కో సినిమా కోట్ల‌కు కోట్లు ప‌లుకుతుంది. సినిమా హిట్టు ఫ్లాపుతో పనిలేకుండా విడుద‌ల‌కు ముందే పెద్ద సినిమాల‌కు శాటిలైట్ అయిపోతుంది. దాంతో నిర్మాత‌లు ఒడ్డున ప‌డిపోతున్నారు. స‌ర్దార్, బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్స్ ను కూడా భారీ రేట్ కు కొనేసాయి ఛానెల్స్. మొత్తానికి ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ నిర్మాత‌ల‌కు మూడు పువ్వులు ఆరు కాయ‌ల్లా మారిపోయింది. 

More Related Stories