English   

రోజా+దిల్ సే+బొంబాయ్=చెలియా

2017-04-03 19:58:10

ఏంటి లెక్క అనుకుంటున్నారా..?  కానీ మ‌ణిర‌త్నం తాజా సినిమా చెలియాను చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. మ‌ణిర‌త్నం మ‌ళ్లీ త‌న పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నాడేమో అనిపిస్తుంది చెలియా ట్రైల‌ర్ చూస్తుంటే..! ఓకే బంగారంతో స‌ఖి సినిమాను గుర్తుకు తెచ్చాడు మ‌ణి. ఇప్పుడు చెలియా సినిమాతో మ‌రోసారి రోజా, బొంబాయ్ సినిమాలు గుర్తుకు తెస్తున్నాడు. టెర్ర‌రిజం నేప‌థ్యంలో సినిమాలు చేయ‌డంలో మ‌ణిర‌త్నంను మించిన ద‌ర్శ‌కుడు ఇండియాలోనే లేడు. రోజా అయినా.. బొంబాయ్, దిల్ సే లాంటి సినిమాలైనా మ‌ణి స్టామినా ఏంటో చూపిస్తాయి. ఇప్పుడు చెలియాలో కూడా ఇలాంటి అంశాలే క‌నిపిస్తున్నాయి. 
ఈ సినిమా ప్యూర్ ల‌వ్ స్టోరీగా వ‌స్తోంది. కార్తి, అదితిరావ్ హైద్రీ జంట‌గా న‌టిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న చెలియా పాటలు ఇప్ప‌టికే అంద‌ర్నీ మాయ చేసాయి. ఇక ట్రైల‌ర్ లో, పాట‌ల్లో కార్తి, అదితి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో కార్తి పైలైట్ గా న‌టిస్తున్నాడు. చెలియా సినిమా ఎప్రిల్ 7న విడుద‌ల కానుంది. మ‌ణిర‌త్న‌మే ఈ సినిమాకు నిర్మాత.  2 గంట‌ల 7 నిమిషాల షార్ప్ ర‌న్ టైమ్ తో వ‌స్తోంది చెలియా. మొత్తానికి చెలియాతో మ‌ణి చేసే మాయ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories