English   

అఖిల్ మాజీ ప్రేయ‌సికి పెళ్లి..!

2017-04-03 20:09:07

శ్రేయాభూపాల్.. కొన్ని రోజుల కింద‌ ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. దానికి కార‌ణం అఖిల్ అక్కినేని. ఈ కుర్ర హీరోతో ప్రేమాయ‌ణం.. వీళ్ళ ఇద్ద‌రి నిశ్చితార్థంతో శ్రేయా పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఎంత వేగంగా వీళ్ల ప్రేమ తెర‌పైకి వ‌చ్చిందో.. అంతే వేగంగా తెర‌వెన‌క్కి వెళ్లిపోయింది కూడా. ఏమైందో ఏమో కార‌ణం తెలియ‌దు గానీ అఖిల్, శ్రేయా విడిపోయారు. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ భామ మ‌రో కుర్రాన్ని పెళ్లి చేసుకోడానికి సిద్ధ‌మైంద‌నే టాక్ వినిపిస్తుంది. ఎన్నారై సంబంధానికి శ్రేయాభూపాల్ ఓకే చెప్పింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. జివికే మ‌న‌వ‌రాలైన శ్రేయాభూపాల్.. కొన్నేళ్లుగా అఖిల్ తో ప్రేమ‌లో ఉంది. ఈ మ‌ధ్యే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో ఇద్ద‌రూ విడిపోయారు. ఈ బ్రేక‌ప్ జ‌రిగి రెండు నెల‌లు కూడా గ‌డ‌వ‌క ముందే శ్రేయా పెళ్లి మ్యాట‌ర్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. చూడాలిక‌.. అఖిల్ మాజీ ప్రేయ‌సి పెళ్లి ఎలా జ‌ర‌గ‌బోతుందో..? ఎంత గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతుందో..?

More Related Stories