English   

 ప‌డుకోక‌పోతే ఇక్క‌డ ప‌న‌వ్వ‌దా..? 

2017-04-03 20:13:46

ఇండ‌స్ట్రీ ఎందుకు ఇలా త‌యారవుతుంది.. ఈ మ‌ధ్యే ఇలా ఉందా.. లేదంటే ఎప్ప‌ట్నుంచో ఇలాగే ఉందా..? అస‌లేంటి సంగ‌తి అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య ప్ర‌తీ హీరోయిన్ బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అవ‌కాశాలు ఇవ్వాలంటే ప‌డుకోక త‌ప్ప‌ద‌ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇది వ‌ర‌కు మాట్లాడ‌టానికి కూడా భ‌య‌ప‌డే హీరోయిన్లు ఇప్పుడు ఏ భ‌యం లేకుండా చెప్పేస్తున్నారు. క‌స్తూరి.. రాధికాఆప్టే.. తాప్సీ.. శృతి హ‌రిహ‌ర‌న్.. వర‌ల‌క్ష్మి.. ఇలా రోజుకో ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అరాచ‌కాల‌పై నోరు విప్పుతూనే ఉంది. తాజాగా బెంగ‌ళూర్ డేస్ లో న‌టించిన పార్వ‌తి మీన‌న్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. 
ప‌డుకోకపోతే ఇక్క‌డ ప‌ని జ‌ర‌గ‌దు అంటూ ప‌చ్చిగా మాట్లాడేసింది. త‌నను బెడ్రూమ్ కు రావాలంటూ ఓ మ‌ళ‌యాల హీరో, ద‌ర్శ‌కుడు అడిగార‌ని.. వెళ్ల‌క‌పోయేస‌రికి అవ‌కాశాలు రాలేద‌ని చెప్పింది పార్వ‌తి. ఇక కాజ‌ల్ కూడా ఇప్పుడు ఈ విష‌యంపై మాట్లాడింది. త‌న‌కెప్పుడూ ఇలాంటి అనుభ‌వాలు ఎదురు కాక‌పోయినా.. త‌న స‌న్నిహితులు మాత్రం దీని గురించి మాట్లాడార‌ని చెప్పింది కాజ‌ల్. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే కొన్నిసార్లు ద‌ర్శ‌కుల‌కు, హీరోలకు పడ‌క సుఖం పంచ‌క త‌ప్ప‌ద‌ని చెప్పింది కాజ‌ల్. కంగ‌న ర‌నౌత్ కూడా ఈ విష‌యంపై గ‌ట్టిగానే నోరు విప్పింది. మొత్తానికి ఇలా రోజుకో హీరోయిన్ దీని గురించి మాట్లాడుతుంటే ఎక్క‌డ త‌మ పేరు బ‌య‌టికి వ‌స్తుందో అని కొంద‌రు ద‌ర్శ‌కులు, హీరోలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బ‌తుకుతున్నారు.

More Related Stories