English   

ఐస్ క్రీమ్ అందాలు ఊరిస్తున్నాయిగా..

2017-04-03 20:18:22

తెలుగమ్మాయిలు ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటార‌నేది ఒక‌ప్ప‌టి మాట‌. అవ‌కాశం రావాలే గానీ బాలీవుడ్ బ్యూటీస్ ను కూడా త‌మ గ్లామ‌ర్ తో డామినేట్ చేస్తాం అనేది నేటి ముద్దుగుమ్మ‌ల మాట‌. ఇప్ప‌టికే అంజ‌లి, మ‌ధుశాలిని లాంటి భామ‌లు అందాల ఆర‌బోత‌లో త‌మ‌కు పెద్ద‌గా హ‌ద్దులు లేవ‌ని చూపించారు. ఇప్పుడు వీళ్లంద‌రికీ ధీటుగా వ‌చ్చేస్తుంది తేజ‌స్విని. సీత‌మ్మ వాకిట్లో..తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వ‌ర్మ ఐస్ క్రీమ్ సినిమాతో వెలుగులోకి వ‌చ్చేసింది. ఆ సినిమాలో చిట్టిపొట్టి బ‌ట్ట‌ల‌తో సెగలు పుట్టించింది తేజ‌స్వి. పైగా సినిమా సినిమాకు డోస్ పెంచేస్తుంది ఈ భామ‌. ఇక హాట్ హాట్ ఫోటోషూట్ల‌తోనూ మ‌త్తెక్కిస్తుంది తేజ‌స్వి. 
ఒక్కో సినిమాతో పాపులారిటీ పెంచేసుకుంటుంది తేజ‌స్వీ. ఆ మ‌ధ్య వ‌చ్చిన దిల్ రాజు కేరింత‌లో గ్లామ‌ర్ షోను సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసింది తేజ‌స్వి. అందులో మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్లు ప‌ద్ద‌తిగా క‌నిపిస్తే.. తేజ‌స్వి మాత్రం హాట్ షోల‌తో పిచ్చెక్కించింది. ఇక ఓంకార్ త‌మ్ముడు హీరోగా తెర‌కెక్కిన‌ జ‌త‌క‌లిసే చిత్రంలో తేజ‌స్వి త‌న గ్లామ‌ర్ తో మ‌తులు పోగొట్టేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు హంట‌ర్ రీమేక్ బాబు బాగా బిజీలో న‌టిస్తోంది. ఇందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ తో క‌లిసి లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్స్ లోనూ న‌టించేసింది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్స్, ట్రైల‌ర్స్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఈ సినిమా త‌ర్వాత తేజ‌స్వి ఇమేజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. గ్లామ‌ర‌స్ కారెక్ట‌ర్ ల‌కు తేజు అడ్ర‌స్ ప్రూఫ్ గా మారిపోతుందంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మొత్తానికి అందాలే పెట్టుబ‌డిగా సినిమా సినిమాకు దూసుకుపోతుంది ఈ ఐస్ క్రీమ్ పాప‌.

More Related Stories