English   

 క‌ట్ట‌ప్ప సీక్రేట్ బ‌య‌ట‌ప‌డిపోయింది..

2017-04-04 23:08:15

ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్వ‌శ్చ‌న్ ఏదైనా ఉందా అంటే అది క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..? స‌్వ‌యానా న‌రేంద్ర మోడీ కూడా క‌ట్ట‌ప్ప మ్యాట‌ర్ ఎత్తాడంటే ఆస‌క్తి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌గా ఉన్న ఈ సీక్రేట్ ఇప్పుడు కొద్దిగా రివీల్ అయిపోయింది. దీన్ని బ‌య‌ట పెట్టింది ఎవ‌రో తెలుసా..? క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని పొడుస్తున్న‌ట్లుగా ఓ పోస్ట‌ర్ డిజైన్ చేసారు క‌దా ఆయ‌న‌..! అత‌డి పేరు విశ్వ‌నాథ్ సుంద‌రం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ గా వ‌ర్క్ చేస్తున్నాడు. రాజ‌మౌళి ఇత‌డి ద‌గ్గ‌రికి వ‌చ్చి సీన్ చెప్పిన‌పుడు అత‌డు 10 పోస్ట‌ర్స్ డిజైన్ చేసి ఇచ్చినా జ‌క్క‌న్న మాత్రం సాటిస్ ఫై కాలేద‌ట‌. సినిమా రేంజ్ ను ఫిక్స్ చేసే పోస్ట‌ర్ కావ‌డంతో ఎక్క‌డా కాంప్రమైజ్ కాలేద‌ట రాజ‌మౌళి. మ‌రోసారి త‌న‌తో కూర్చుని సీన్ ఇలా ఉంటుంది   అని చెప్పి.. వెన‌కాల మంట‌లు వ‌చ్చేలా.. క‌ట్ట‌ప్ప‌, బాహుబ‌లి ఔట్ షేడ్స్ లో క‌నిపించేలా ఓ పోస్ట‌ర్ డిజైన్ చేయించుకున్నాడ‌ని రాజ‌మౌళిని పొగిడేసాడు విశ్వ‌నాథ సుంద‌రం. అయితే ఇంత చేసినా బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో మాత్రం చెప్ప‌లేద‌ట ఈ ద‌ర్శ‌క ధీరుడు. మొత్తానికి క‌ట్ట‌ప్ప సీక్రేట్ చెప్పిన‌ట్లే చెప్పి ఏమీ చెప్ప‌లేదంటున్నాడు విశ్వ‌నాథ్ సుంద‌రం.

More Related Stories