English   

ఆగ‌డులా ఉందేంటి మ‌హేశా..?

2017-04-05 10:23:05

ఒక్కోసారి ఓ సినిమా స్టిల్ చూస్తుంటే మ‌రో సినిమా గుర్తుకు రావ‌డం కామ‌న్. అది సాధార‌ణ విష‌యం కూడా. కానీ అచ్చంగా మ‌రో సినిమా మాదిరే ఉంటే కాపీ కొట్ట‌డం అంటారు. ఇప్పుడు మ‌హేశ్ సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈయ‌న ప్ర‌స్తుతం మురుగ‌దాస్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ ను ఇప్పుడు కెమెరామెన్ సంతోష్ శివ‌న్ ట్వీట్ చేసాడు. ఇది చూసిన త‌ర్వాత అభిమానులు షాక్ అయ్యారు. అదేంటి అనుకుంటున్నారా.. దానికి కార‌ణం ఆగడులో ఉన్న ఓ స్టిల్ అచ్చంగా ఇప్పుడు విడుద‌లైన స్టిల్ గా ఉండ‌ట‌మే. స‌గానికి క‌ట్ చేసిన మ‌హేశ్ ఇమేజ్ చూస్తుంటే మూడేళ్ల కింద వ‌చ్చిన ఆగ‌డు ఫోటోను గుర్తుకు తెస్తుంది. మ‌రి ఇది తెలిసి క‌ట్ చేసారో లేదంటే తెలియ‌కుండా అలా జ‌రిగిపోయిందో మురుగ‌దాస్ అండ్ టీంకే తెలియాలి. పైగా మురుగ‌దాస్ పై కాపీ క్యాట్ అనే ముద్ర బ‌లంగా ఉంది.

More Related Stories