English   

బాహుబ‌లి దుర‌దృష్ట‌వంతులు వీళ్ళే..

2017-04-06 02:05:22

అదేంటి.. బాహుబ‌లి దుర‌దృష్ట‌వంతులు ఏంటి.. ఆ సినిమాకు ప‌నిచేసిన వాళ్ల జాత‌కాలే మారిపోయాయి క‌దా అనుకుంటున్నారా..? అవును.. బాహుబ‌లితో చాలా మంది కెరీర్స్ మారిపోయాయి. కానీ కొంద‌రు ఈ సినిమాను చేతులారా వ‌దిలేసుకున్నారు. వాళ్లిప్పుడు ఈ సినిమా స‌క్సెస్ చూసి బాధ ప‌డుతున్నారు. ఒక్క‌రో ఇద్ద‌రో కాదు.. ఏకంగా ఐదు మంది న‌టులు బాహుబ‌లిని మిస్ చేసుకున్నారు. బాహుబ‌లిలో ఉన్న కీల‌క‌మైన పాత్ర‌ల‌న్నింటికీ ముందు రాజ‌మౌళి తీసుకున్న‌ది.. ఊహించుకున్న‌ది వేరే వాళ్ల‌నే. అనుకోకుండా వాళ్ల స్థానంలోకి ఇప్పుడున్న వాళ్లు వ‌చ్చారు. మ‌రి బాహుబ‌లిని మిస్ చేసుకున్న ఆ దురదృష్ట‌వంతులు ఎవ‌రో తెలుసా..

శివ‌గామి: శ్రీ‌దేవి... వ‌చ్చింది ర‌మ్య‌కృష్ణ‌

శివ‌గామి పాత్ర కోసం ముందుగా రాజ‌మౌళి అనుకున్న‌ది శ్రీ‌దేవినే. తాను అనుకున్న పాత్ర‌కు అతిలోక సుంద‌రి అయితే ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని భావించాడు జ‌క్క‌న్న‌. ఈ పాత్ర కోసం రాఘ‌వేంద్ర‌రావ్ తో కూడా రాయ‌బారం చేయించాడు. కానీ మూడేళ్ల పాటు ఒకే సినిమాకు డేట్స్ ఇవ్వ‌డం అంటే కుద‌ర‌దు అనేసింది శ్రీ‌దేవి. ఆ త‌ర్వాతే ర‌మ్య‌కృష్ణ ఆ పాత్ర‌లోకి వ‌చ్చింది. ఇప్పుడు ఆమెకు వ‌చ్చిన క్రేజ్.. రెస్పాన్స్ చూసి శ్రీ‌దేవి నిజంగానే షాక్ అవుతుంది. 

క‌ట్ట‌ప్ప‌: మోహ‌న్ లాల్.. వ‌చ్చింది స‌త్య‌రాజ్

క‌ట్ట‌ప్ప.. ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియ‌ని వాళ్లంటూ ఉండ‌రు. బాహుబ‌లి సినిమాకు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణ‌మే క‌ట్ట‌ప్ప‌. ఈ కారెక్ట‌ర్ లో స‌త్య‌రాజ్ ఒదిగిపోయాడు. కానీ ఈ పాత్ర‌కు ముందుగా మోహ‌న్ లాల్ ను అనుకున్నాడు రాజ‌మౌళి. కానీ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే మోహ‌న్ లాల్.. ఒకే సినిమా కోసం మూడేళ్లు ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు.

భ‌ళ్ళాలదేవుడు: వివేక్ ఒబేరాయ్.. వ‌చ్చింది రానా

బాహుబ‌లిలో హీరో త‌ర్వాత అంత పేరొచ్చింది భ‌ళ్ళాళ‌దేవుడి పాత్ర‌కే. రానా చేసిన ఈ పాత్ర నేష‌న‌ల్ వైడ్ గా ఫేమ‌స్ అయింది. కానీ ఈ పాత్ర కోసం వివేక్ ఒబేరాయ్ ను ముందుగా అనుకున్నాడు రాజ‌మౌళి. ఇది వివేక్ కు కూడా న‌చ్చింది. కానీ ఆ టైమ్ లో మ‌రో సినిమాకు క‌మిట్ మెంట్ ఉండి బాహుబ‌లిలో భాగం కాలేక‌పోయాడు వివేక్ ఒబేరాయ్.

అవంతిక‌:  సోన‌మ్ క‌పూర్.. వ‌చ్చింది త‌మ‌న్నా

అవంతిక పాత్ర కోసం ముందుగా సోన‌మ్ క‌పూర్ ను అనుకున్న రాజ‌మౌళి.. ఆ త‌ర్వాత త‌మ‌న్నాతో స‌రిపెట్టుకున్నాడు. ఒకే సినిమా కోసం ఇన్నేళ్లు ఇవ్వ‌డం ఇష్టంలేని సోన‌మ్.. ఆ పాత్ర‌ను వ‌దిలేసింది. అదే పాత్ర త‌మ‌న్నా కెరీర్ కు ప్రాణం పోసింది.

దేవ‌సేన‌: న‌య‌న‌తార‌.. వ‌చ్చింది అనుష్క‌

దేవ‌సేన పాత్ర అనుష్క కెరీర్ ను ఎలా మార్చేసిందో తెలిసిందే. ఈ పాత్ర‌కు అనుష్క త‌ప్ప మ‌రేవ‌రూ సెట్ కాలేరేమో అనేంత‌గా ఆమె న‌టించింది. అయితే ఈ పాత్ర కోసం రాజ‌మౌళి ముందుగా అనుకున్న‌ది న‌య‌న‌తార‌నే. దేవ‌సేన పాత్ర న‌యన్ కైతే బాగా సూట్ అవుతుంద‌ని భావించాడు ద‌ర్శ‌క ధీరుడు. కానీ ఒకే సినిమా కోసం అన్నేళ్లు డేట్స్ ఇవ్వ‌డం ఇష్టం లేని న‌య‌న‌తార‌.. దేవ‌సేన‌కు నో చెప్పేసింది. మొత్తానికి అప్పుడు బాహుబ‌లిని మిస్ చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు ఈ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి బాధ ప‌డుతున్నారు. రేపు బాహుబ‌లి 2 విడుద‌లైన త‌ర్వాత అది ఇంకే రేంజ్ లో ఉండ‌బోతుందో..?

More Related Stories