English   

అయ్యో పాపం.. శ‌ర్వా బ్యాడ్ ల‌క్..!

2017-04-06 04:25:01

శ‌ర్వానంద్ కు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే చాలు సూప‌ర్ హిట్ కు త‌క్కువ కావ‌డం లేదు. శ‌త‌మానం భ‌వ‌తితో 30 కోట్ల హీరో అయిపోయాడు శ‌ర్వానంద్. ఇది వ‌ర‌స‌గా ఆయ‌న‌కు నాలుగో విజ‌యం. ఈ టైమ్ లో శ‌ర్వా సినిమా అంటే క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ సంద‌డి ఉంటుంది. కానీ నిజంగా ఇప్పుడు ఓ అద్భుత‌మైన ఛాన్స్ మిస్స‌య్యాడు శ‌ర్వానంద్. ఈయ‌న న‌టించిన రాధా సినిమా మార్చ్ 29న విడుద‌ల కావాల్సింది. కానీ కాట‌మ‌రాయుడు కోసం ఈయ‌న త్యాగం చేసాడు. కానీ ఆ టైమ్ కు గురు త‌ప్ప మ‌రే సినిమా నిల‌బ‌డ‌లేదు. కాట‌మ‌రాయుడు కూడా పెద్ద‌గా సంద‌డి చేయ‌లేదు. గురు ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయింది. ఇలాంటి టైమ్ లో రాధా లాంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఉండుంటేనా క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ శ‌ర్వానంద్ కెరీర్ లో ప‌డేది. కానీ రాయుడు కోసం శ‌ర్వానంద్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఆయ‌న‌కు మంచి అవ‌కాశాన్ని దూరం చేసింది. మే లో రాధా విడుద‌ల కానుంది. కానీ అప్పుడు డిజే, బాహుబ‌లి 2 లాంటి భారీ సినిమాలున్నాయి.

More Related Stories