English   

శృతిహాసన్ కు పెళ్లైపోయిందా..?

2017-04-06 07:03:06

ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌కు కూడా ఇదే అనుమానాలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు స‌న్న‌గా మెర‌పుతీగ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయింది. ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌డ‌మే మానేసింది. మొన్న విడుద‌లైన కాట‌మ‌రాయుడులో శృతి అప్పియ‌రెన్స్ పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌పై మ‌రో వార్త కూడా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే శృతిహాసన్ పెళ్లి. అవును.. ఈ భామ‌కు పెళ్లైపోయింద‌నే వార్త‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. లండ‌న్ లో ఈమెకు ఓ ప్రియుడు ఉన్నాడు. అత‌డితోనే డేటింగ్ చేస్తుంది శృతి. పైగా ఈ మ‌ధ్య మాట్లాడితే లండ‌న్ వెళ్తోంది శృతిహాస‌న్. అక్క‌డే వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టేసార‌ని తెలుస్తోంది. దీనికి క‌మ‌ల్ నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంద‌ట‌. అందుకే శృతిహాస‌న్ పెళ్లైన విష‌యాన్ని దాచేసి.. హాయిగా లండ‌న్ ట్రిప్పులు వేస్తుంద‌ని తెలుస్తోంది. పైగా ఇప్పుడు సినిమాలు కూడా ఏమీ చేయ‌ట్లేదు శృతి. ఇదివ‌ర‌కు క‌మిటైన సినిమాల‌తో బిజీగా ఉంది గానీ కొత్త వాటికి మాత్రం ఓకే చెప్ప‌డం లేదు. 

More Related Stories