English   

హిట్టిస్తే గానీ న‌మ్మ‌వా వెంకటేశా..?

2017-04-06 07:26:38

భూమి గుండ్రంగా ఉంటుంది.. తిరిగి తిరిగి వ‌చ్చిన చోటుకే వ‌చ్చి ఆగుతుంది అంటారు. వెంక‌టేశ్ విష‌యంలోనూ ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఈయ‌న తాజా సినిమా గురు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు సాధిస్తుంది. ఇప్ప‌టికే బ‌డ్జెట్ వెన‌క్కి తెచ్చేసి.. లాభాల్లోకి ఎంట‌ర‌వుతుంది. అయితే ఈ సినిమా విజ‌యం గురించే తెలిసిన వాళ్ల‌కు దీని చ‌రిత్ర కూడా తెలియాలి క‌దా..! గురు కాన్సెప్ట్ ను ముందు సుధా కొంగ‌ర చెప్పింది వెంక‌టేశ్ కే. కానీ ఆ టైమ్ లో ఎందుకో వెంకీ ఈ క‌థ‌కు నో చెప్పాడు. ఆ త‌ర్వాతే అది సాలాఖ‌డూస్ గా హిందీ.. ఇరుదు సుట్రుగా త‌మిళ ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి వెళ్లింది. అక్క‌డ హిట్టైన త‌ర్వాత సుధ మ‌ళ్లీ తెలుగులో రీమేక్ చేయ‌డానికి వ‌చ్చింది. ఇక్క‌డ రానాతో రీమేక్ చేయాల‌నుకున్నా.. వెంక‌టేశ్ తానే కోరి మ‌రీ ఈ రీమేక్ లో న‌టించాడు. అంటే హిట్ వ‌చ్చిన తర్వాత గానీ గురు క‌థ‌పై వెంకీకి న‌మ్మ‌కం లేన‌ట్లే. ఒక‌వేళ హిందీ, త‌మిళ్ లో తేడా కొట్టి ఉంటే గురు తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసేవాడే కాదు..!

More Related Stories