English   

మ‌హేష్ కోసం బాలీవుడ్ నుంచి

2017-04-07 00:27:36

మ‌న మ‌హేష్‌బాబు ప‌క్క‌న బాలీవుడ్ భామ‌ని చూడాల‌నే కోరిక అంద‌రిలోనూ బ‌లంగా ఉంది. మ‌రి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు కానీ... బోలెడుమంది బాలీవుడ్ భామ‌ల పేర్లు  ప్ర‌చారంలోకి వ‌స్తూనే ఉన్నాయి. దీపికా ప‌దుకొణే మొద‌లుకొని అలియా భ‌ట్ వ‌ర‌కు అందులో ఉన్నారు. నిజానికి ద‌ర్శ‌కులు కూడా ఆ దిశ‌గా సీరియ‌స్‌గానే ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సుకుమార్‌, కొర‌టాల శివ‌, మురుగ‌దాస్‌లాంటి  ద‌ర్శ‌కులు వాళ్ల వాళ్ల సినిమాల్ని ఆరంబించే స‌మ‌యంలో బాలీవుడ్‌కి చెందిన కొద్దిమంది   క‌థానాయిక‌ల్ని సంప్ర‌దించారు కూడా. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌వ‌ల్ల కుద‌ర్లేదు. తాజాగా మాత్రం మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఓ భామ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టే అని టాలీవుడ్ వ‌ర్గాలు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాయి. ధోని సినిమాలో న‌టించిన కైరా అద్వానీ మ‌హేష్‌తో ఆడిపాడుతుంద‌నేది తాజా స‌మాచారం. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అందులో హీరోయిన్‌గా మొద‌ట నేను శైల‌జ ఫేమ్ కీర్తిసురేష్‌ని ఎంపిక చేసుకోవాల‌నుకొన్నారు. ఆమె కూడా ఓకే చెప్పేసింది. అయితే కొర‌టాల శివ సినిమా ఆల‌స్యం కావ‌డంతో ఆమె మ‌హేష్ సినిమాకి నో చెప్పింది. దాంతో ఇప్పుడు మ‌హేష్ కోసం కొర‌టాల బాలీవుడ్‌కి వెళ్లి కైరాని ఎంపిక చేసుకొన్నాడ‌ని, ఇందులో ఆమెతో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

More Related Stories