English   

శ్రీనువైట్ల ఆ హీరోని టార్గెట్ చేశాడా?

2017-04-07 00:36:08

నిజ జీవితంలో తార‌స‌ప‌డిన వ్య‌క్తుల్ని ఆస‌రాగా చేసుకొని కామెడీ స‌న్నివేశాలు రాసేస్తుంటాడు శ్రీనువైట్ల‌. అవి తెర‌పై బాగా పేలిపోతుంటాయి. అలాగే కొన్ని సార్లు వివాదాలకి కూడా కార‌ణ‌మ‌వుతుంటాయి. కింగ్, ఆగ‌డు సినిమాల్లోని స‌న్నివేశాలు మీడియాకి కూడా ఎక్కాయి. చ‌క్రి, ప్ర‌కాష్‌రాజ్ స్వ‌యంగా ప్రెస్‌మీట్లు పెట్టి త‌మ బాధ‌ని వ్య‌క్తం చేశారు. అయినా స‌రే... శ్రీనువైట్ల మాత్రం ఆ శైలి సెట్టైరిక‌ల్ కామెడీని వ‌ద‌ల‌డం లేదు. నిజానికి ఆ త‌ర‌హా కామెడీనే ఆయ‌న బ‌లం అంటుంటారు. అందుకే మిస్ట‌ర్‌లోనూ సెట్టైరికల్ కామెడీ స‌న్నివేశాల్ని బాగా ద‌ట్టించాడ‌ట‌. ఈసారి ఏకంగా ఓ స్టార్ హీరోని దృష్టిలో ఉంచుకొని ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. శ్రీనువైట్ల‌తోనూ క‌లిసి ప‌నిచేసిన ఆ స్టార్ హీరో లేడీస్ పేర్ల‌తో ఎక్కువ‌గా సినిమాలు చేశారు. అదే విష‌యాన్ని ఆస‌రాగా చేసుకొనే స‌న్నివేశాల్ని డిజైన్ చేశాడ‌ట శ్రీనువైట్ల‌. ఆ హీరో పాత్ర‌లో పృథ్వీ న‌టించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే స్పూఫ్‌లు ఎక్కువ‌గా చేస్తున్నాడ‌ని పృథ్వీపై ఓ హీరో  అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు మరో హీరోని స్పూఫ్ చేశాడంటే మ‌రి ఈసారి ఆయ‌న అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories