English   

ఇంత చిన్న చూపా..! 

2017-04-07 01:19:45

తాప్సీ ఎంత హాట్‌ అమ్మాయో అంతే ముక్కుసూటితనం ఉన్న అమ్మాయి. ఏ విషయాన్నైనా, ఎదుటివారు ఎలాంటి వ్యక్తి అయినా ఆన్‌ ద స్పాట్‌ విషయాన్ని కడిగిపడేస్తుందంతే. ఇటీవల ఓ విషయం పై ఆమె ఘాటుగా స్పందించింది. ''సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ జయాపజయాలనుబట్టి విలువిస్తారు. అదే అమ్మాలనైతే మరీ చులకనగా చూస్తారు. సినిమా కథ అనుకున్నప్పుడు మాతో సంబంధం ఉండదు. బడ్జెట్‌ విషయంలో మాతో ఎలాంటి చర్చలు జరగవు. నిర్మాతలు ఖర్చుపెట్టే కోట్ల వ్యయంలో మాకు ఇచ్చేది చాలా తక్కువ అమౌంట్‌. సినిమా సక్సెస్‌ కాకపోతే మాత్రం హీరోయిన్‌ ఐరెన్‌లెగ్‌ అనీ, అన్‌లక్కీ గర్ల్‌ అని అనేస్తారు, రాసేస్తారు. ఆలోచన లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు. 

ఒక అమ్మాయి కుటుంబాన్ని వదిలి తెలియని ప్రాంతానికి వచ్చి. భాష నేర్చుకుని ఇన్‌ సెక్యూర్‌గా రకరకాల ఇబ్బందులు పడుతుంటే అమ్మాయిల పట్ల ఎందుకలా ప్రవర్తిస్తారో అర్ధంకాదు. అవన్నీ మానసికంగా ఎంత బాధను కలిగిస్తాయో తెలుసా? అంటూ మీడియాను ప్రశ్నించింది. టాలీవుడ్‌లో ఆ ఇబ్బంది తట్టుకోలేకే బాలీవుడ్‌, కోలీవుడ్‌ మీద దృ
ష్టి పెట్టాను. అక్కడ అందుకున్న విషయాలు తెలుగు పరిశ్రమలో ఎదురైన ఇబ్బందులను మరచిపోయేలా చేశాయి అని తెలిపింది. తన మాటలు విన్నాక... తాప్సీ ఆవేదనలో అర్ధం ఉందనిపించట్లేదు.


పింక్‌, ఘాజీ, నామ్‌ షబానా వంటి చిత్రాలతో కథానాయికగా తనని తాను నిరూపించుకున్న తాప్సీ ప్రస్తుతం తెలుగులో తను ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్న ఓ పాత్రని పాఠశాల దర్శకుడు మహి వి. రాఘవన్‌ దర్శకత్వంలో చేస్తున్నట్లు తెలిపింది. ఆ పాత్రతో తెలుగులో తనకు దొరకని గుర్తింపు లభిస్తుందని తాప్సీ ఆశాభావం వ్యక్తం చేసింది.

More Related Stories