English   

గోపీచంద్ అంటే ద‌ర్శ‌కుల‌కు ప‌డ‌దా..?

2017-04-08 04:33:24

యాక్ష‌న్ హీరో గోపీచంద్ చాలా అమాయ‌కంగా సైలెంట్ గా క‌నిపిస్తాడు.. కానీ ఆయ‌న పైకి క‌నిపించేంత సైలెంట్ ఏమీ కాదంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఈయ‌న సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు ఓ ర‌కంగా భ‌యం కూడా ఉంటుంద‌ట‌. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని హైలైట్ చేసి చూస్తాడ‌ట ఈ యాక్ష‌న్ హీరో. అందుకే గోపీచంద్ తో సినిమా మొద‌లుపెట్టిన త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు త‌మ‌కు వ‌ద్దు ఈ ప్రాజెక్ట్ అంటూ వ‌దిలేసి వెళ్లిపోయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గా బి గోపాల్ సినిమా కూడా ఇంతే. దీనికి ముందు భూప‌తి పాండ్య‌న్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న కాద‌న్నాక గోపాల్ వ‌చ్చాడు. ఇప్ప‌టికీ ఈ సినిమా పూర్తి కాలేదు. దాంతోపాటు ఆక్సీజ‌న్ సినిమా స‌మ‌యంలోనూ ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ‌తో గోపీచంద్ కు వివాదాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టికీ ఈ సినిమా పూర్తి కాలేదు. సంప‌త్ నంది గౌత‌మ్ నందా సినిమా షూటింగ్ పూర్తైపోయింది. ఈ సినిమా ఎప్రిల్లోనే రావాల్సింది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల తేదీ అనౌన్స్ చేయ‌లేదు. అస‌లే విజ‌యాల్లేక అల్లాడుతున్న గోపీచంద్.. ఇలా ద‌ర్శ‌కుల‌తో సున్నం పెట్టుకుంటే ఏమైపోతాడో ఏమో..?

More Related Stories