English   

ఫ్యామిలీ పాలిటిక్స్ చేస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 

2017-04-08 05:12:30

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సూప‌ర్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజ‌కీయాలు.. మ‌రోవైపు సినిమాల‌తో ఫుల్ బిజీ అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సూప‌ర్ స్టార్. ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లైపోయింది. తొలి షెడ్యూల్ లోనే ప‌వన్ తో పాటు కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువ‌ల్ కూడా జాయిన్ అయిపోయారు. ఎప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు నాన్ స్టాప్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత చిన్నబ్రేకుల‌తో షూటింగ్ జ‌ర‌ప‌నున్నాడు త్రివిక్ర‌మ్. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా ఎలా ఉండ‌బోతుందనే విష‌యంపై పెద్ద చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. ఇది ఫ్యామిలీ ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు పొలిటిక‌ల్ గానూ ప‌వ‌న్ ఇమేజ్ కు ప్ల‌స్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈ సినిమా కోసం బ‌ల్క్ డేట్స్ ఇచ్చేసాడు ప‌వ‌ర్ స్టార్. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే త్రివిక్ర‌మ్ సినిమా ఆగ‌స్ట్ 11న లేదంటే.. సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కావ‌డం ఖాయం. మ‌రి ప‌వ‌న్ స్పీడ్ ను త్రివిక్ర‌మ్ అందుకుంటాడా..?

More Related Stories