English   

కీర్తిసురేష్ స్ట్రాట‌జీ ఏంటి..?

2017-04-08 05:19:53

కీర్తిసురేష్.. ఊహించిన దానికంటే చాలా త‌క్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. నేను లోక‌ల్, నేను శైల‌జ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది కీర్తి. ఈ భామ డేట్స్ కోసం ఇప్పుడు స్టార్ నిర్మాత‌లు సైతం వేచి చూస్తున్నారు. ఇక స్టార్ హీరోలు కూడా కీర్తిసురేషే కావాలంటున్నారు. ఇక ఈ మ‌ధ్యే కీర్తిసురేష్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన స్టేట్ మెంట్ ఇచ్చింది. అదేంటంటే.. తాను సీనియ‌ర్ హీరోల‌తో న‌టించ‌న‌ని. అవును.. ఏ హీరోయిన్ అయినా సీనియ‌ర్ స్టార్ హీరోలతో అవ‌కాశం వ‌స్తే బాగున్ను అనుకుంటుంది. కానీ కీర్తి మాత్రం సీనియ‌ర్స్ తో న‌టిస్తే తాను ముదురు అయిపోతాన‌ని ఫీల‌వుతుంది. అందుకే ఈ త‌రం స్టార్ హీరోల‌తో మాత్ర‌మే న‌టిస్తానంటుంది. దానికి త‌గ్గ‌ట్లుగానే ప‌వ‌న్, సూర్య లాంటి టాప్ హీరోల‌తో మాత్ర‌మే న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఓ సీనియ‌ర్ హీరో సినిమా అడిగితే నో చెప్పేసింది కీర్తిసురేష్. మొత్తానికి సీనియ‌ర్ల‌తో న‌టిస్తే ఎక్క‌డ కుర్ర హీరోలు ప‌క్క‌నబెడ‌తారో అని పెద్ద ప్లానే వేసింది ఈ బ్యూటీ.

More Related Stories