English   

నాని అబద్ధాలు చెబుతున్నాడు..?

natural star nani

నేచురల్ స్టార్ గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. సడెన్ గా నిర్మాతగా మారాడంటే అంతా ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ టాప్ బ్యూటీస్ కు ఇందులో యాక్ట్ చేయిస్తున్నాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో నాని ఓ విషయాన్ని చెబుతున్నాడు. ఈ కథ తనకు పూర్తిగా తెలియదని. కానీ ఇది అబద్ధం అని ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గర్నుంచీ నాని చెబుతోన్న మాటలు గమనిస్తే అర్థమైపోతుంది. యస్.. లేటెస్ట్ గా నాని కాజల్ గురించి కూడా చెప్పాడు. మూవీ కాజల్ ను సెట్స్ లో ఒక్కసారే కలుసుకున్నాను. తర్వాత ఆడియో ఫంక్షన్ అప్పుడే తను చూడ్డం అన్నాడు. సరే అది నిజమే అని నమ్మేద్దాం.. కానీ దాంతో అతను చెబుతున్నదేంటంటే.. ఈ మూవీ కథ కాజల్ తో పాటు తనకూ తెలియదంటున్నాడు. ఇదే అబద్ధం.

సినిమా నిర్మిస్తున్నానని చెప్పినప్పుడు నాని అన్నమాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. ఈ దర్శకుడు తన వాయిస్ ఓవర్ కోసం నా వద్దకు వచ్చాడు. అప్పుడే కథేంటని అడిగా.. అతను కథ చెప్పాక ఇలాంటి కథ సింపుల్ గా వెళ్లిపోకూడదు అని నేనే నిర్మిస్తాను అని చెప్పాను అన్నాడు. అంటే కథ నానికి తెలుసు. అయినా తెలియదనీ.. అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతోంది.

కథ తెలియకుండా ఒప్పేసుకోవడానికి నాని ఏమీ చేపల చెరువులు అమ్మేసి సినిమా తీయడానికి రాలేదు. స్టోరీ సెలెక్షన్ లో హీరోగానే ఎంతో మెచ్యూర్ గా ఉంటాడు. అలాంటి నిర్మాతగా మాత్రం జాగ్రత్తగా ఉండడా.. ?అయినా ఇలా ఎందుకు చెబుతున్నాడు అంటే దర్శకుడికీ, అతనికీ చెడిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా రిజల్ట్ కూడా సెన్సార్ ను బట్టి ఊహించినంత గొప్పగా ఏం లేదట. ఇవన్నీ తనపైకి రాకుండా పూర్తిగా దర్శకుడిపైకి తోసేయడానికే నాని ఇలాంటి కబుర్లు చెబుతున్నాడంటున్నారు చాలామంది. ఏదేమైనా నాకు కథ తెలియదు అని నాని చెబుతున్నది అవాస్తవం. దాన్ని తరచి చూసినప్పుడు ఇప్పుడు వినిపిస్తోన్న రూమర్స్ అన్నీ నిజమే అనిపించక మానవు. మరి అందులో ఎన్ని వాస్తవాలున్నాయో మరికొన్ని గంటల్లో సినిమా రిజల్ట్ తో తేలిపోతుంది.

More Related Stories