English   

రాజ‌కీయాల‌కు రెడీ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

మెగా ఫ్యామిలీ మెల్లగా రాజ‌కీయాల్లోనూ బిజీ అవుతుంది
2018-05-24 20:13:09

మెగా ఫ్యామిలీ మెల్లగా రాజ‌కీయాల్లోనూ బిజీ అవుతుంది. ఇప్ప‌టికే చిరంజీవి ఓ అడుగు వేసాడు.. ఇప్పుడు మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చి సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నాడు. వీళ్ళు స‌రిపోరు అన్న‌ట్లు ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా రాజ‌కీయాల కోసం రెడీ అవుతున్నాడు. అడ‌గ‌డ‌మే ఆల‌స్యం తాను కూడా పాలిటిక్స్ వైపు వెళ్తానంటూ చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్. అయితే పూర్తిస్థాయిలో కాదు.. జ‌ప్ట్ గెస్ట్ అప్పియ‌రెన్స్ అంతే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌డే రాజ‌కీయ ప్రచారం చేస్తున్నాడు. ఆయ‌న వెంట ఎవ‌రూ లేరు అభిమానులు త‌ప్ప‌. మ‌రోఐవ‌పు ఆయ‌న కుటుంబాన్ని కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. ఒక్క‌డే అంతా చేసుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో చ‌ర‌ణ్ మాట్లాడుతూ త‌న బాబాయ్ పిల‌వ‌డ‌మే ఆల‌స్యం క‌చ్చితంగా వెళ్లి ప్ర‌చారం చేస్తానంటున్నాడు. ప్ర‌జారాజ్యం టైమ్ లోనే ప్ర‌చారం చేద్దాం అనుకుంటే చిన్న పిల్లాడివి వ‌ద్దు అన్నార‌ని గుర్తు చేసాడు ఈ హీరో. ఇప్పుడు బాబాయ్ అడిగితే క‌చ్చితంగా జ‌నాల్లోకి వ‌స్తానంటున్నాడు. అయితే ప‌వ‌న్ తీరు చూస్తుంటే మెగా కుటుంబంలో ఒక్క‌ర్ని కూడా ద‌రికి రానిచ్చేలా లేదు.

More Related Stories