English   

నీవెవ‌రో రివ్యూ

Neevevaro-movie-review
2018-08-24 02:48:53

స‌రైనోడు, రంగ‌స్థలం లాంటి సినిమాల‌తో తెలుగులోనూ పాపుల‌ర్ అయిన న‌టుడు ఆది. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో అయితే గుర్తింపు తెచ్చుకోలేదు ఈ హీరో. కానీ ఇప్పుడు ఇది కూడా ట్రై చేస్తున్నాడు. ఈయ‌న న‌టించిన నీవెవ‌రో విడుద‌లైంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది..? 

క‌థ‌: క‌ళ్యాణ్(ఆది పినిశెట్టి) అంధుడు. 15 ఏళ్లున్న‌పుడే అనుకోకుండా క‌ళ్లు పోతాయి. కానీ సొంత కాళ్ల‌పై నిల‌బ‌డి చెఫ్ గా ఎదుగుతాడు. రెస్టారెంట్ న‌డుపుతూ జీవితం గ‌డుపుతుంటాడు. ఈయ‌న‌కు ఓ గాళ్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. త‌న పేరు అను(రితికా సింగ్). ఇరు కుటుంబాలు ఇష్ట‌ప‌డి వీళ్ల పెళ్లి కూడా నిశ్చ‌యిస్తారు. అప్పుడే క‌ళ్యాణ్ లైఫ్ లోకి వెన్నెల‌(తాప్సీ) వ‌స్తుంది. చీక‌ట్లో ఉన్న క‌ళ్యాణ్ కు వెలుగు తెస్తుంది. కొన్ని రోజులు హాయిగా ఉంటుంది కానీ అంత‌లోనే మాయ‌మైపోతుంది. ఆమెను వెత‌క‌డానికి క‌ళ్యాణ్ బ‌య‌ల్దేర‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది..? అస‌లు వెన్నెల దొరికిందా లేదా అనేది అస‌లు క‌థ‌.. 

విశ్లేష‌ణ‌:ఈ మ‌ధ్య కాలంలో హీరోలో లోపం ఉంటే చాలు సినిమాలు ప్రేక్ష‌కులకు న‌చ్చేస్తున్నాయ‌ని అనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ క‌థ‌లో కూడా ద‌మ్ము ఉండాల‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. అలా ఉన్నాయి కాబ‌ట్టే రంగ‌స్థ‌లం.. రాజా ది గ్రేట్.. ఊపిరి లాంటి సినిమాలు ఆడాయి. ఇప్పుడు నీవెవ‌రోలో కూడా ఆది అంధుడిగా న‌టించాడు. కానీ అందులో విష‌యం మాత్రం త‌క్కువ‌గా ఉంది. తెలిసిన క‌థ‌నే మ‌రింత రొటీన్ గా చెప్పాడు ద‌ర్శ‌కుడు హ‌రినాథ్. దాంతో కొత్త‌గా ఏం అనిపించ‌లేదు.. మ‌రీ నీర‌సంగా సాగే క‌థ క‌థ‌నంతో బోర్ కొట్టించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఆది లాంటి న‌టుడున్నా కూడా ఎక్క‌డా ఆయ‌న్ని వాడుకోలేదు. ఫ‌స్టాఫ్ అంతా తీసిన సీన్సే మ‌ళ్లీ తీసి.. చెప్పిన క‌థే మ‌ళ్లీ చెప్పి రిపీటెడ్ గా సాగ‌దీసాడు. ఇదే అతిపెద్ద మైన‌స్. స‌స్పెన్స్ కు వీలున్నా కూడా స్క్రీన్ ప్లేలో విష‌యం లేక‌పోవ‌డంతో తేలిపోయింది క‌థ‌. ముఖ్యంగా తాప్సీ విల‌నీ సీన్స్ అస్స‌లు వాడుకోలేదు. అక్క‌డ‌క్క‌డా క‌థ‌లో చూపించడంతోనే స‌రిపెట్టేసాడు ద‌ర్శ‌కుడు. ఆమె పాత్ర‌ను చుట్టేసాడేమో అనిపించింది. సెకండాఫ్ లో కూడా అయితే క‌థే లేన‌ట్లుగా పూర్తిగా వెన్నెల కిషోర్ ను దించి ఆయన చుట్టూనే సీన్స్ అల్లుకున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు లేక‌పోవ‌డంతో ఓ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది నీవెవ‌రో. తీరా చివ‌రికి వ‌చ్చేస‌రికి ఇదే క‌దా.. ముందు నుంచి మేం కూడా చెబుతున్న‌ది అంటూ ప్రేక్ష‌కుల్లో తెలియ‌ని నీర‌సంతో పాటు ఆవేశం కూడా వ‌స్తుంది. క్లైమాక్స్ లో ఏదో మ‌మ అనిపించేలా ఓ ఫైట్ సీన్ పెట్టి క‌థ ముగించాడు ద‌ర్శ‌కుడు. 

న‌టీన‌టులు: ఆది పినిశెట్టి బానే చేసాడు. కానీ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో అస‌లు అంత‌గా న‌టించ‌డానికి కూడా ఏమీ లేదు. ఈయ‌న లాంటి న‌టుడి నుంచి ఇది ఊహించద‌గ్గ సినిమా అయితే కాదు. రితికా సింగ్ అందంగా ఉంది. తాప్సీ మాత్రం స‌ర్ ప్రైజ్. విల‌న్ గా అల‌రించింది ఈ భామ‌. కారెక్ట‌ర్ కొత్త‌గా ఉంద‌ని ట్రై చేసింద‌ని సినిమా చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. ఇక సినిమాలో ఉన్న కామెడీ అంతా వెన్నెల కిషోర్ ఒక్క‌డే మోసాడు. పూర్తిగా ఆయ‌న్ని న‌మ్ముకునే సెకండాఫ్ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. మిగిలిన వాళ్లంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: అచ్చు సంగీతం ప‌ర్లేదు. పాట‌లు అయితే పెద్ద‌గా అల‌రించ‌లేదు. ఒక్క సిద్ శ్రీ‌రామ్ పాడిన వెన్నెల వెన్నెల పాట మాత్రం బాగుంది. సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. విశాఖ అందాల‌తో పాటు భీమిలీ బీచ్ కూడా బాగానే చూపించాడు. ఎడిటింగ్ చాలా వీక్. రెండు గంట‌ల సినిమానే అయినా కూడా సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. కోన‌వెంక‌ట్ నిర్మాణ విలువ‌లు ప‌ర్లేదు. త‌క్కువ బ‌డ్జెట్ లోనే తీసాడు. ఇక ద‌ర్శ‌కుడిగా హ‌రినాథ్ కు కోరుకున్న విజ‌యం ఈ సినిమా తీసుకురాలేక‌పోవ‌చ్చు. 

చివ‌ర‌గా:నీవెవ‌రో.. ఆది చివ‌రికి ఏమ‌వునో..?

రేటింగ్: 2/5 

More Related Stories