English   

డబ్బులిస్తే ముద్దులు బావుంటాయి-  హెబ్బా పటేల్

Hebah-Patel-24-Kisses
2018-08-24 11:55:58

కుమారి 21ఎఫ్ తో ఓవర్ నైట్ కుర్రాళ్ల హాట్ ఫేవరెట్ గా మారిన డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్. అంతకు ముందే అలా ఎలా అనే సినిమాలో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ నెక్ట్స్ స్టెప్ కు చాలామంది షాక్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మీడియం రేంజ్ హీరోలకు హాట్ ఫెవరెట్ గా మారిన హెబ్బా తర్వాత అనూహ్యంగా వెనకబడింది. యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా అందాల ప్రదర్శనలో అస్సలేమాత్రం మొహమాటపడని హెబ్బా చాలాకాలం తర్వాత మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే టైటిల్ తోనే ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో ‘మిణుగురులు’ అనే అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన అయోధ్య కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో అమ్మడు సెన్సేషనల్ కమెంట్స్ చేసింది. డబ్బులు ఇస్తే అన్నీ బానే ఉంటాయి అంటూ హీరో అరుణ్ అదిత్ తో అన్న మాట విన్నవారంతా షాక్ అయ్యారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో అమ్మడు తనదైన శైలిలో మాట్లాడుతూ వెళుతోంది. అయితే మధ్యలో మైక్ అందుకున్న హీరో అరుణ్ అదిత్ ‘అందరూ అడుగుతున్నారు.. అరుణ్ మంచి కిస్సరా కాదా’ అన్నాడు.. డబ్బులిస్తే ఏదైనా ఓకే అంటూ సంచలనంగా మాట్లాడేసింది. (వెన్ యూ పెయిడ్ ఎవ్రీ థింగ్ ఈజ్ గూడ్) అంటూ తను చెప్పిన మాటలకు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాతో తను చాలా బోల్డ్ గా నటించాననీ.. ఆ విషయంలో బాగా ఎక్స్ పీరియన్స్ వచ్చింది కాబట్టి.. బాగా యాక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకూక తను చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఈ సినిమా మరో ఎత్తు.. ఆ స్థాయిలో నా నటన నాకే నచ్చింది అంటూ తెగ చెప్పుకుంటూ వెళ్లింది కానీ.. అందరికీ ఆమె చెప్పిన ఆ ‘డబ్బులు ఇస్తే అన్నీ బానే ఉంటాయ్’ అనే  మాటే రిజిస్టర్ కావడం విశేషం. 

More Related Stories