English   

దేవదాస్ ఫస్ట్ పెగ్ కు టైమొచ్చింది

DevaDas-Movie-First-Look
2018-08-24 12:58:36

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందుతున్నట్టు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకే ఈ సినిమాను చాలా రోజుల తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. ఇక మళ్లీ రావా ఫేమ్ ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదల కాబోతోంది. ఈ టీజర్ కు వీళ్లు ‘ఫస్ట్ పెగ్’ అనే నామకరణం కూడా చేశారు. ఈ నెల 24న సాయంత్రం 5గంటలకు ఈ ఫస్ట్ పెగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇది ఎంత కిక్ ఇస్తుందో తెలియదు కానీ.. ఈ సినిమాపై మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక నాని, నాగ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఈ టీమ్ గట్టి ప్రమోషన్స్ చేయడం లేదనేది మాత్రం నిజం. ఇంతకు ముందు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన భలే మంచి రోజు, శమంతకమణి రెండు సినిమాలూ కాన్సెప్ట్ బేస్డ్ గా సాగిన వైవిధ్యమైన సినిమాలు. అందుకే నాగార్జున, నాని అతని కథకు ఓకే చెప్పారు. నాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా నటిస్తోన్న ఈ మూవీ ఓ ఫ్రెంచ్ మూవీకి అనఫీషియల్ ఫ్రీమేక్ అని చెబుతున్నారు. కానీ దర్శకుడు అది నిజం కాదంటున్నాడు., ఏదేమైనా ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ టుక్ పోస్టర్ జనం ఆవులించారు. ఈ ఫస్ట్ పెగ్ వారికి ఎంత కిక్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories