English   

మహేష్ బాబు మనసు దోచిన పేపర్ బాయ్

Mahesh-babu-Paper-Boy
2018-08-24 16:52:09

మహేష్ బాబుకు ఏదైనా నచ్చితే వెంటనే షేర్ చేసుకుంటాడు. కొన్నాళ్ల క్రితం ఈ మెంటాలిటీ లేదు కానీ.. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయిన తర్వాత అవతలి వారిని అభినందించడానికి ఏ మాత్రం వెనకాడ్డం లేదీ శ్రీమంతుడు. సినిమాలైనా, టీజర్లైనా.. టైటిల్స్ అయినా.. ఏదైనా నచ్చితే వెంటనే ట్వీట్ చేస్తూ ఆకట్టుకుంటోన్న మహేష్ ను లేటెస్ట్ గా పేపర్ బాయ్ ఆకట్టుకున్నాడు. అందుకే కాస్త ఆలస్యంగా ట్రైలర్ చూసినా. అస్సలే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ట్రైలర్ ను తెగ పొగిడేశాడు. ‘ట్రైలర్ చాలా ఫ్రెష్ గా, ప్లెజెంట్’ గా ఉందని ట్వీట్ చేశాడు. అంతే కాదు.. ఈ సినిమాకు తనకు పర్సనల్ గా కూడా మనసుకు నచ్చిన విషయమని చెప్పాడు. అందుకు కారణం ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ తండ్రి శోభన్ తో మహేష్ బాబు గతంలో ‘బాబీ’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆడకపోయినా ఓ టెక్నీషియన్ గా శోభన్ పై ఉన్న అభిమానాన్ని అతని తనయుడి సినిమాపై చూపించి, ఎంటైర్ టీమ్ కు శుభాకాంక్షలు అని చెప్పి పెద్ద మనసు చాటుకున్నాడు మహేష్ బాబు.  

మహేష్ బాబు చెప్పాడని కాదు కానీ.. నిజంగానే పేపర్ బాయ్ ట్రైలర్ చాలా బావుందనే టాక్ వచ్చింది. చాలా సెన్సిబుల్ స్టోరీగా కనిపిస్తోంది. ట్రైలర్ లోనే అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. సెన్సిబుల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. అన్నిటికి మించి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ ట్రెండ్ గా మారిన ఓ లిప్ లాక్ కూడా ఉంది. ఇక దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాతో జయశంకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. రియా సుమన్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది. 

More Related Stories