English   

సమంత షాకింగ్ డెసిషన్ 

U-Turn
2018-08-24 17:06:20

సమంత ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ యూ టర్న్ పోస్ట్ పోన్ అవుతుందా.. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పవన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ టైమ్ లో సడెన్ గా ఈ మూవీకి పోస్ట్ పోన్ చేసుకోక తప్పడం లేదంటున్నారు. అందుకు కారణం కూడా సమంత భర్త నాగచైతన్య కావడం విశేషం. 

యూ టర్న్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇండస్ట్రీ అంతా సమంత ఎఫర్ట్స్ ను తెగ పొగిడారు. చాలామంది ఈ సినిమా సమంతకు మరో హిట్ ఇవ్వడం ఖాయం అన్నారు. ఈ ఉత్సాహాన్నంతా కలుపుకుని ఈ యూ టర్న్ ను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కానీ సడెన్ గా ఈ నెల 31న విడుదల కావాల్సిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు పోస్ట్ పోన్ అయి అదే డేట్ కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సమంత ఇరకాటంలో పడింది. ఇందులో ఎవరి సినిమా హిట్ అయినా మీ వల్లే అని ఫ్యామిలీలో కూడా పర్సనల్ క్లాషెస్ వచ్చినా రాకున్నా.. కానీ బయట కమెంట్స్ మాత్రం వస్తాయి. పైగా శైలజా రెడ్డి అల్లుడు సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద బ్యానర్ లో రూపొందిన సినిమా. మరి వారితో పెట్టుకుని  యూ టర్న్ నిలుస్తుందనుకోలేం. అందుకే అన్ని ఆలోచించుకుని ఇప్పుడు  యూ టర్న్ టీమ్ తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. మరి ఎప్పుడు వస్తారు అనేది త్వరలోనే తెలియజేస్తారట. 

More Related Stories