English   

మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన బాలీవుడ్

Chiranjeevi-Sye-Raa
2018-08-24 17:25:09

నిజమే.. బాలీవుడ్ మెగా ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చింది. మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ తోనే ఈ షాక్ రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అయినా సైరా నరసింహారెడ్డి ఓ స్వాతoత్ర సమరయోధుడి కథతో వస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో భారీ తారాగణమే ఉంది. మరోవైపు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక బాహుబలి చూసిన తర్వాత ఈ సినిమాను కూడా ఆ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందించాలని డిసైడ్ అయ్యాడు నిర్మాత రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే ముందు కేవలం తెలుగులో మాత్రమే చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ను తర్వాత విస్తరించారు. సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఎలాగూ సౌత్ లో మెగాస్టార్ తెలియని వారుండరు కాబట్టి చరణ్ చేసింది తప్పేమీ కాదు. కానీ ఇక్కడే ఓ హిడెన్ ఎజెండా ఉంది. పేరుకు సౌత్ లో రిలీజ్ చేసినా టార్గెట్ మాత్రం బాలీవుడ్. యస్.. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయాలనేది రామ్ చరణ్ ప్లాన్. కానీ ఇప్పుడా ప్లాన్ బెడిసి కొట్టింది.. దీంతో మెగా ఫ్యామిలీ షాక్ తిందనే చెప్పాలి. 

నిజానికి ఈ టీజర్ తో బాలీవుడ్ జనాలు సైరా కోసం ఎగబడతారనుకున్నారు సైరా మేకర్స్. కానీ అలా జరగలేదు సరికదా.. అక్కడి నుంచి కనీసం అమితాబ్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేయలేదు. దీంతో అక్కడి టాప్ క్రిటిక్స్ లో ఒకడైన తరణ్ ఆదర్శ్ మాత్రం ఈ టీజర్ కూడా చెప్పాడు. కానీ అతనేమీ రివ్యూ చేయలేదు. దీంతో బాహుబలి లాగా తమ సినిమాకూ బాలీవుడ్ నుంచి రైట్స్ కోసం ఎగడబతారనుకున్న వీరి ప్లాన్ తలకిందులైంది. ఈ విషయం ముందే ఊహించాడేమో.. రామ్ చరణ్ ఆ టీజర్ లాంచింగ్ రోజే చెప్పాడు.. మేం కేవలం సౌత్ లాంగ్వేజ్ లోనే విడుదల చేయబోతున్నాం అని. కానీ అసలు మేటర్ ఇది.. బాలీవుడ్ నుంచి సైరా సినిమాపై ఎవరూ ఆసక్తి చూపించలేదు. పైగా టీజర్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు. అసలు ఈ టీజర్ రాకపోయినా బావుండేది కొందరు హార్డ్ కోర్ మెగాభిమానులే చెప్పుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా బాలీవుడ్ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసిన మెగా ఫ్యామిలీ షాక్ అయిందనే చెప్పాలి. మరి ఇక ముందైనా సైరా కు సంబంధించిన విషయాల్ని మరింత ఇంట్రెస్టిగ్ గా.. రూపొందించుకుంటారేమో చూడాలి. 

More Related Stories