English   

హ్యాట్సాఫ్ లారెన్స్ ..

Kerala-Floods
2018-08-24 18:00:30

డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి.. రికగ్నిజ్డ్ డ్యాన్సర్ గా ఎదిగి.. తర్వాత కొరియోగ్రాఫర్ గా మారిన డ్యాన్సర్ లారెన్స్.. తర్వాత తనలోని మల్టీ టాలెంట్స్ ను చూపిస్తూ మాస్ డైరెక్టర్ గా అవతరించాడు. దర్శకుడుగా మంచి క్రౌడ్ ఫుల్లర్ అనిపించుకున్నాడు. ఒకప్పుడు ప్రభుదేవా తర్వాత అంత డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా దుమ్మురేపిన లారెన్స్ దర్శకుడుగా మారిన తర్వాత కాంచన సిరీస్ తో సౌత్ ను భయపెడుతున్నాడు. మొత్తంగా డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడుగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ మరోకోణం ఉంది. అదే దయాగుణం.. మనోడు ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతాడు. ఇప్పటికే యాభై మందికి పైగా చిన్నారులకు సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు లారెన్స్. ఇకపైనా ఈ హార్ట్ ఫుల్ సర్వీస్ కంటిన్యూ అవుతుంది కూడా. అలాగే చెన్నై వరదల టైమ్ లో కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయిన లారెన్స్ ఇప్పుడు కేరళ వరద బాధితుల కోసం అతి పెద్ద మనసు చాటుకున్నాడు. 

గత కొన్నాళ్లుగా కురిసిన వర్షాలకు వరదలకు కేరళ అతలాకుతలం అయిపోయిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది సినిమా సెలబ్రిటీస్ అక్కడి బాధితుల కోసం ఎంతో సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ఏకంగా ‘‘కోటి రూపాయలు’’ సాయం ప్రకటించాడు. మనకు సోదరుల వంటి వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మన బాధ్యత అంటూ అతను తను కోటి రూపాయలు విరాళం ఇస్తోన్న విషయాన్ని ప్రకటించాడు.. ఏదేమైనా ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా స్టార్స్ లో లారెన్స్ అంత మొత్తం ఇచ్చిన నటుడు మరెవరూ లేరు.  కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ విజయ్ 14కోట్లు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు.. అతను 75లక్షలు మాత్రమే ప్రకటించాడు.. ఇచ్చాడు. ఇతర స్టార్స్ విక్రమ్ 35లక్షలు ఇవ్వగా మిగిలిన సౌత్ టాప్ స్టార్స్ అంతా 25లక్షల చొప్పున ప్రకటించాడు. కానీ ఇప్పుడా అందరికంటే లారెన్స్ ఎక్కువగా కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఏదేమైనా హ్యాట్సాఫ్ టు లారెన్స్  .. 

More Related Stories