English   

అక్కడ ‘టెంపర్’ మొదలైంది

Vishal-Ayogya
2018-08-24 11:35:19

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సినిమా ‘టెంపర్’. టెంపర్ కు ముందు మనోడు అన్నీ రొడ్డకొట్టుడు సినిమాలే చేశాడు. అన్నీ వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ టైమ్ లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లోచేసిన టెంపర్ వైవిధ్యమైన సినిమాగా ఎన్టీఆర్ కు తిరుగులేని హిట్ ఇచ్చింది. పైగా ఈ సినిమాలో మనోడు సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఇక క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు కళ్లు చెమర్చని వారుండరు. మొత్తంగా టెంపర్ ఇచ్చిన సక్సెస్ తో తనను తాను పూర్తిగా మార్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాంటి టెంపర్ ఇప్పటికే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా రీమేక్ అవుతోంది. అక్కడ టెంపర్ టైటిల్ ‘సింబా’గా మార్చారు. ఈ మూవీతో సైఫ్ అలీఖాన్ కూతురు సైరా అలీఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా తమిళ్ లో కూడా ఈ రీమేక్ మొదలైంది. 

ప్రస్తుతం డిఫరెంట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొడుతోన్న పెందెంకోడి విశాల్ ఈ టెంపర్ తమిళ్ రీమేక్ లో హీరో. విశాల్ కు ఈ పాత్ర పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అప్పుడే చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే అతనే చేస్తున్నాడు. హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తుండటం విశేషం. ఇక సౌత్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన ఏఆర్ మురుగదాస్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన వెంకట్ మోహన్ ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వెంకట్ మోహన్ మురుగదాస్ కు ఫస్ట్ అసోసియేట్ ఎడిటర్ కావడం విశేషం. ఇంతకీ ఈ మూవీ తమిళ్ టైటిల్ ఏంటో తెలుసా.. ‘అయోగ్య’.

More Related Stories