English   

దేవదాస్ టీజర్ టాక్: నానీ.. ఏంటీ సంగతి

DevaDas-Teaser
2018-08-24 12:05:23

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా వస్తోన్న సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే టైటిల్ కూడా అట్రాక్టివ్ గా ఉందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకునేలానే ఉందని చెప్పాలి. 

నాగార్జున మందు కలుపుకుంటుంటాడు.. నాని కూడా తన గ్లాస్ కడుక్కుని చొక్కాతో తుడుచుకుని.. గ్లాస్ పెడతాడు.. ఆ టైమ్ లో నాని ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ఒక రకంగా నాని ‘చార్లీ చాప్లిన్’ను గుర్తుకు తెచ్చాడు. అలా ఉన్నాయా ఎక్స్ ప్రెషన్స్. అటు నాగ్.. సోడా కావాలా వాటర్ కావాలా అని అడిగే లోపే ఇతను గ్లాస్ ఖాళీ చేస్తాడు. సరే అని మరో పెగ్ వేస్తే అది కూడా ఖాళీ.. మరి మరీ ఇంతలా ‘రా’ తాగేస్తున్నాడంటే నాని ఎంత బాధలో ఉన్నాడో అనిపించక మానదు. అదే దేవా కూడా అడిగాడు.. ‘‘దాసూ ఏంటీ సంగతి’’అని.. ఆ వెంటనే సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అనే టైటిల్ పడుతుంది.. అంటే నాని ఎందుకలా రా తాగుతున్నాడో తెలియాలంటే సెప్టెంబర్ 27న థియేటర్స్ లో చూడమని చెప్పినట్టే కదా.. దట్స్ ద మేటర్.

ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ మూవీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యలో మేటర్ ఉందని అందరికీ తెలుసు. అసలు అతను నాని, నాగార్జునను ఒప్పించినప్పుడే సగం సక్సెస్ అయ్యాడు. మిగతా సగం తన టాలెంట్ చూపించగలిగితే దేవదాసు హిట్ అయినట్టే. మొత్తంగా ఈ మూవీలో నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా నటిస్తున్నట్టు ముందు నుంచీ చెబుతున్నారు. మరి ఈ డాక్టర్ కు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో .. ఆ డానే తీర్చాలి.

More Related Stories