English   

 గీత‌గోవిందం.. అదృష్టం అంటే నీదే రాజా..!

Geetha-Govindam
2018-08-24 21:12:43

ఇంకేం ఇంకేం కావాలి.. అన్న‌పుడు కూడా ప్రేక్ష‌కుల‌కు అర్థం కాలేదు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. గీతగోవిందం దూకుడు ఇప్ప‌ట్లో ఆగడం క‌ష్టంగానే ఉంది. ఎందుకంటే రోజురోజుకీ ఇంకా ర‌చ్చ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే సినిమా వ‌చ్చి ప‌ది రోజులు పూర్తైనా కూడా హౌజ్ ఫుల్స్ ప‌డుతున్నాయి అంటే ర‌చ్చ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 9 రోజుల్లోనే 46 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి.. 75 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర కొండ‌. ఇది చూసిన త‌ర్వాత ఇంకెవ‌రైనా విజ‌య్ ను చిన్న హీరో అంటే అంత‌కంటే బూతు మ‌రోటి ఉండ‌దు. ఈయ‌న ఇమేజ్ ఇంత‌గా పెరిగిపోయింది అని బ‌హుశా ఆయ‌న‌కు కూడా తెలియ‌లేదేమో..?  ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఇప్ప‌ట్లో త‌గ్గ‌డం కూడా క‌ష్ట‌మే. ఎందుకంటే ఈ వారం సినిమాలేవీ లేవు.. ఆది నీవెవ‌రోపై కొద్దోగొప్పో అంచ‌నాలుండేవి కానీ అవి కూడా ప్రీమియ‌ర్ ప‌డిన త‌ర్వాత పోయాయి. సినిమా నీర‌సంగా ఉందంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక నారా రోహిత్ ఆట‌గాళ్లు సినిమాపై వాళ్ల‌కు పెద్ద‌గా న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. మిగిలిన ప్ర‌భుదేవా ల‌క్ష్మి.. ర‌ష్మి అంత‌కుమించి సినిమాల‌కు టికెట్స్ తెగేంత సినిమా అయితే క‌నిపించ‌డం లేదు. ఎలా చూసుకున్నా మ‌రో మూడు రోజుల పాటు గీత‌గోవిందం ర‌చ్చ సాగ‌డం ఖాయం. రెండో వీకెండ్ లో కూడా క‌నీసం 10 కోట్లు ప్లాన్ చేస్తున్నాడు గీత‌గోవిందం. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చి ఆగుతుందో..? 

More Related Stories