English   

ఈ ముద్దులేంది బాబోయ్ 

24-Kisses-trailer
2018-08-24 22:28:29

టైటిల్ లోనే 24 ముద్దులున్నాయి. ఇంక సినిమాలో అంతకు మించి అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేవలం ట్రైలర్ లోనే ముద్దులు హద్దులు దాటిపోయాంటే సినిమాలో ఇంక ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పలేం. అన్నట్టుగా ఉందీ ట్రైలర్.. గతంలో ‘మిణుగురులు’ వంటి సందేశాత్మక చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు అయోధ్య కుమార్ ఒక్కసారిగా ట్రెండ్ మార్చి తీసిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఇక కనుమరుగైపోయింది అనుకుంటోన్న హెబ్బా పటేల్ ఈ సినిమాలో మరింత రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీతో తనకు మరిన్ని ఆఫర్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక హీరోగా నిలదొక్కుకోవడానికి గత కొన్నాళ్లుగా ట్రై చేస్తోన్న అరుణ్ అదిత్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మొత్తంగా ట్రైలర్ తో ఒక్కసారిగా ఆకట్టుకుందీ మూవీ టీమ్.. కాకపోతే ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది వెంకటేష్ గతంలో చేసిన ‘ప్రేమతో రా’ సినిమా వాసనలు కనిపిస్తున్నాయి. ప్లే బాయ్ అయిన హీరో ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడేస్తాడు. తర్వాత తనను వాడుకుని వదిలేస్తాడు. అలా హీరోయిన్ కూడా అతనికి బలైపోతుంది. మరి ఆ తర్వాత హీరోయిన్ అతనికి ఎలా బుద్ధి చెప్పింది.. లేదా తన ప్రేమలో ఎలా పడేసుకుంది వంటి కథనంతో వస్తోన్న సినిమాగా అర్థమౌతోంది. సరిగ్గా ఇదే పాయింట్ కదా ప్రేమతో రా కూడా. అందుకే ఆ స్మెల్స్ ఉన్నాయి. ఏదేమైనా అయోధ్యకుమార్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories