English   

అనూ ఇమ్మానుయేల్ అలా డిసైడ్ అయిందా..?

Anu-Emmanuel
2018-08-25 08:36:09

స్మాల్ హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనూ ఇమానుయేల్. తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లో ఆఫర్ రాగానే అమ్మడు ఎక్కడికో వెళుతుందనుకున్నారు. పైగా దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో ఇక అనూ దశ తిరిగినట్టుగానే భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో అప్పటి వరకూ అనూనే మా హీరోయిన్ అనుకున్నవాళ్లు కూడా వెనక్కి తగ్గారు. పైగా సినిమా డిజాస్టర్ అయినా హీరోయిన్ గా తను వేసిన ఇంపాక్ట్ మామూలుగా కూడా లేకపోవడంతో ఇక తను పెద్ద హీరోలతో చేయడం కష్టం అనుకున్నారు. కానీ అప్పటికే ఒప్పుకున్న నా పేరు సూర్య ఉండటంతో అది హిట్ అయితే లక్ తిరుగుతుందనుకున్నారు. బట్ నా పేరు సూర్య కూడా పోయింది. ఇక ఇప్పుడు చేస్తోన్న శైలాజా రెడ్డి అల్లుడు పై ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా హిట్ అయినా మళ్లీ స్టార్ హీరోలతో ఆఫర్స్ వస్తాయనే నమ్మకం లేదు. అందుకే తను కొత్త నిర్ణయం తీసుకుంది.  తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ లాస్ట్ ఇయర్ తుప్పరివాలన్(తెలుగులో డిటెక్టివ్) అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. కానీ అప్పటికే తెలుగులో అజ్ఞాతవాసికి కమిట్ అయి ఉండటంతో తర్వాత అక్కడ ఆఫర్స్ వచ్చినా పట్టించుకోలేదు. కానీ ఇకపై తను కోలీవుడ్ పైనే దృష్టిపెట్టాలనుకుంటోందట. అందుకు తగ్గట్టుగానే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అసలే ఇలా చబ్బీగా ఉండే భామల్ని మన తమిళ తంబిలు బాగా ఎంకరేజ్ చేస్తారు. అది తనకు ప్లస్ అయ్యే అంశం. ప్రస్తుతం తుప్పరివాలన్ తర్వాత అమ్మడికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది.  డిఫరెంట్ మూవీస్ తో కాన్ స్టంట్ హిట్స్ కొడుతోన్న మోస్ట్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి సినిమాలో అనూకు ఆఫర్ వచ్చింది. అసలే సినిమాలు వస్తాయా రావా అనే మీమాంసలో ఉన్న అనూ ఈ ఆఫర్ రాగానే ఆనందంగా ఒప్పేసుకుంది. విజయ్ సేతుపతి సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ఉంది. సో.. అనూ అక్కడ పాగా వేయాలని డిసైడ్ కావడం వెనక ఖచ్చితమైన రీజనే ఉందనుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుంది.. 

More Related Stories