English   

షెడ్ నుంచి బ‌య‌టికి రాని ట్యాక్సీవాలా..

Taxiwala-release
2018-08-25 09:54:41

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే చిన్న సినిమానే కదా.. పోతే 5 కోట్లు పోతాయి అంతే క‌దా అని ఇప్పుడు లైట్ తీస్కోడానికి లేదు. మ‌నోడిప్పుడు మ‌నీ స్పిన్న‌ర్. ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు. ఎంత‌లా అంటే 9 రోజుల్లోనే 75 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసేంత‌గా. రెండు రోజుల్లోనే పెట్టుబ‌డితో పాటు బ‌య్య‌ర్ల‌ను లాభాల్లోకి తీసుకెళ్లేంత‌గా. అలాంటి హీరో సినిమా అంటే ఇప్పుడు అంచ‌నాలు కూడా భారీగానే ఉంటాయి క‌దా.. అందుకే గీత‌గోవిందం త‌ర్వాత విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ట్యాక్సీవాలాకు పూర్తిగా రిపేర్లు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ బండి షెడ్ లో ఉంది. అంటే మ‌ళ్లీ రీ షూట్లు చేస్తున్నార‌న్న‌మాట‌. 

ఇప్పుడు విజ‌య్ కు పెరిగిన ఇమేజ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా క‌థ‌ను మార్చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా గీతాఆర్ట్స్ లోనే కావ‌డంతో కాస్త ఆల‌స్య‌మైనా ప‌ర్లేదంటున్నాడు అల్లు అర‌వింద్. ఆయ‌న‌తో పాటు యువీ క్రియేష‌న్స్ కూడా ట్యాక్సీవాలా నిర్మాత‌ల లిస్ట్ లో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో కానీ విజ‌య్ కు ఫ్లాప్ వ‌స్తే చేసిన క‌ష్టం అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోతుంది. అందుకే లేటైనా లేటెస్ట్ గా రావాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. ట్యాక్సీవాలా కానీ హిట్ట‌యిందా.. ఇక విజ‌య్ ను ఆపేవాడు క‌నిపించ‌డు. ఆయ‌న తోపే.. ఇప్ప‌టికీ తోపే.. కాక‌పోతే ట్యాక్సీవాలా హిట్ త‌ర్వాత మ‌రింత పెద్ద తోపు అయిపోతాడు. ఇది జ‌ర‌గాలంటే ముందు ట్యాక్సీ షెడ్ వ‌దిలి బ‌య‌టికి రావాలి. అదెప్పుడు జ‌రుగుతుందో విజ‌య్ కు కూడా క్లారిటీ లేదిప్పుడు. 

More Related Stories