English   

నవాబ్.. లెజెండ్ ఈజ్ బ్యాక్ 

Nawab-Trailer
2018-08-25 10:37:53

మణిరత్నం లేటెస్ట్ మూవీ నవాబ్ ట్రైలర్ విడుదలైంది. ఆయన స్థాయికి తగ్గట్టుగా అద్భుతమైన కంటెంట్ తో రాబోతున్నట్టు అర్థమైంది. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ ట్రైలర్ ఖచ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేయబోతోందని చెప్పొచ్చు. ‘‘నీకెవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా..? నమ్మొద్దు అని ఓ కరడుగట్టిన రౌడీ అన్నాడంటే దాని వెనక ఎంతో నమ్మకద్రోహం ఉన్నట్టే కదా. యస్.. నమ్మకద్రోహమే కాదు.. ఏ మనిషీ తన నీడను కూడా నమ్మే పరిస్థితిలో లేని సమాజంలో ఉన్నాం ఇప్పుడు. కారణం.. చుట్టూ ఉన్న రౌడీలు, గూండాలు, క్రిమినల్స్. అన్నట్టు ఈ రోజున క్రిమినల్స్ కు చాలా పేర్లున్నాయి. అవేంటో తెలుసా..?పారిశ్రామిక వేత్త, విద్యావేత్త, రియల్ఎస్టేట్ కింగ్ పిన్, ఇసుకమాఫియా, భూపతి రెడ్డి.. మరి ఈ భూపతి ఎవరు.? మాఫియానా, బిజినెస్ మేనా, రాబిన్ హూడా’’ అంటూ సాగే ఈ ట్రైలర్ సింపుల్ గా చెబితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. 

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈజ్ బ్యాక్ అనేలా ఉంది కదా ఈ ట్రైలర్. యస్.. ఆయన కొన్ని సీరియస్ సబ్జెక్ట్స్ ను టచ్ చేసిన ప్రతిసారీ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ ట్రెండ్ సాక్ష్యంగానే ఈ ట్రైలర్ ఉందనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్ లో వస్తోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇదే. ఇంత భారీ తారాగణంతో ఒక్క సీట్ కోసం సాగే పోరాటమే ఈ నవాబ్. తమిళంలో చెక్కచివాంత వానమ్ పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో నవాబ్ గా విడుదల చేస్తున్నారు. డబ్బులున్న ప్రతివాడికీ ఓ  నేర చరిత్ర ఉంటుంది. అది చరిత్ర కాగానే వీళ్లు వర్తమానంలో బిజినెస్ టైకూన్స్ గానో, రాజకీయవేత్తలుగానో, రిచ్ పీపుల్ గానో చెలామణి అవుతుంటారు. ఇది నడుస్తోన్న చరిత్ర.. ఆ చరిత్రనే తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. 

భూపతిగా ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, అదితిరావు హైదరి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. సంతోశ్ శివన్ సినిమాటోగ్రఫీ. మొత్తంగా మణి ఈజ్ బ్యాక్ అనేలా ఉందీ ట్రైలర్. సెప్టెంబర్ 27న విడుదల కాబోతోన్న నవాబ్.. మణిరత్నం స్టామినాను మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ కు చూపిస్తుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories