English   

నాలుగు సినిమాలు కలిసి.. గీత గోవిందతో సెంచరీ కొట్టిస్తాయా..?

Neevevaro
2018-08-25 11:50:36

ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల విడుదలతో కొత్త కళ నెలకొంది. కానీ ఈ కళ ఎక్కువ రోజులు నిలుస్తుందని చెప్పలేం అంటున్నారు. కానీ ఏ సినిమా కూడా జెన్యూన్ హిట్ అనిపించుకోలేకపోయింది. పైగా కాస్త అంచనాలున్న ఆటగాళ్లు మరీ ఆడియన్స్ తో ఆడేసుకున్నారనే టాక్ తెచ్చుకుంది. జగపతిబాబు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ ప్రేక్షకుల సహనంతో టెస్ట్ మ్యాచ్ ఆడుకుందంటున్నారు. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ముందుగా దర్శకుడి వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూసిన వెరీ బ్యాడ్ డైరెక్షన్ ఇదే అంటున్నారు. దీంతో ఈ మర్డర్ మిస్టరీకి ప్రేక్షకులు దూరంగా ఉంటేనే మంచిది అని చూసిన వారంతా అంటున్నారు. 

ఇక తమిళంలో రూపొందిన ‘అవే కనగల్’ అనే చిత్రానికి రీమేక్ గా వచ్చిన నీవెవరో కూడా హిట్ టాక్ తెచ్చుకుంటుందని చెప్పలేం అనేది ట్రేడ్ అంచనాలు. అంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉన్న ఈ మూవీ సెకండ్ హాఫ్ ఓకే అనేలా ఉందంటున్నారు. సెకండ్ హాప్ బావుంటే కొంత వరకూ గట్టెక్కొచ్చనేది ట్రేడ్ సూత్రం. ఆ సూత్రం వర్కవుట్ అయితే నీవెవరో కొంత వరకూ ఫర్వాలేదనిపించే స్థాయిలో వసూళ్లు సాధించొచ్చు. కానీ ఎంత వరకూ నిలబడుతుందనేది చెప్పలేం అంటున్నారు.. చాలామంది. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాలో థ్రిల్స్ తక్కువగా ఉండటం కొంత మైనస్ గా మారిందని చెప్పొచ్చు. 

ఇక వేదికలపై రెగ్యులర్ గా చూసే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వెండితెరపైకి వస్తే ఎలా ఉంటుందో డబ్బింగ్ గా వచ్చిన ప్రభుదేవా లక్ష్మి సినిమా అలా ఉందనే టాక్ వచ్చింది. మామూలుగానే ఈ మూవీపై ఎలాంటి బజ్ లేదు. ఇక సినిమా టాక్ మరీ యావరేజ్ గా ఉండటంతో లక్ష్మికి ప్రేక్షకుల నుంచి లక్ష్మి కళ రావడం కష్టమే అనుకోవచ్చు.. అలాగే కేవలం రష్మి అందాల్నే నమ్ముకుని అంతకు మించి అంటూ వచ్చిన సినిమా ఒక పాటలో రష్మి అందాలకు మించి చెప్పుకునేదేమీ లేదనే టాక్ వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో రష్మి చేసిన సినిమాల్లాగే జస్ట్ వెరీ యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నమాట. రొమాంటిక్ హారర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఏ పార్ట్ కూడా కంప్లీట్ గా లేకపోవడం.. ఉన్నవీ ఆకట్టుకోలేకపోవడంతో అంతకు మించి ఇంక మాట్లాడుకోవడానికేం లేదంటున్నారు.. 

మొత్తంగా ఈ శుక్రవారం వచ్చిన నాలుగు సినిమాల్లో గట్టిగా నిలబడే సినిమా ఏదీ లేదనే చెప్పాలి.. ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గీత గోవిందంకు మరింత కలిసొచ్చే అంశమే.. వీటి రిజల్ట్ తో అతను 100కోట్ల క్లబ్ లో జాయిన్ కావడానికి పూర్తిస్థాయిలో హెల్ప్ చేసినట్టుగానే భావించాలి. అఫ్ కోర్స్ ఇవి బావున్నా.. అతని సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదనుకోండి. ఇప్పటికీ ఎన్నో సెంటర్స్ లో గీత గోవిందం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. అందువల్ల విజయ్ ఈజీగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోతాడు.. 

More Related Stories