English   

మణిరత్నం ఆ హీరోయిన్ ను వదలడం లేదుగా

Aditi-Rao-Hydari
2018-08-25 12:42:57

ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ డైరెక్టర్స్ లో మణిరత్నం పేరు ఖచ్చితంగా ఉంటుంది. సెల్యూలాయిడ్ మెజీషియన్ గా ఆయనకు ఉన్న పేరు అక్షరాలా నిజం. కానీ గత కొన్నాళ్లుగా ‘తన స్థాయి’ విజయాలు అందుకోవడం లేదు. అయినా ప్రతి సినిమాలోనూ తనదైన ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉంటాడు. మరోవైపు మణి అన్ని సినిమాలూ మాస్ ను మరీ ఎక్కువగా ఆకట్టుకోవు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ‘చెక్కచివంత వానమ్’ పేరుతో వస్తోన్న ఈమూవీని తెలుగులో నవాబ్ గా డబ్ చేస్తారు. అయితే సౌత్ లో తను పరిచయం చేసిన తన ‘చెలియా’ను మాత్రం వదల్లేదు మణిరత్నం. 

చెలియా సినిమాతో సౌత్ లో హాట్ ఫేవరెట్ గా మారిన బ్యూటీ అదితిరావు హైదరి. రీసెంట్ గా తెలుగులోనూ ‘సమ్మోహనం’గా అడుగుపెట్టి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ‘అంతరిక్షం’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సౌత్ లో మరికొన్ని ఆఫర్స్ కూడా అందుకుంటోంది. వీటికి ముందు అమ్మడికి బాలీవుడ్ లోనూ సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పేరుంది. అలాంటి ఇప్పుడు సౌత్ లో వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వీటన్నిటికీ కారణం మణిరత్నం. అందుకు మణి సర్ అంటే తనకెంతో గౌరవం అని ప్రతి చోటా చెప్పుకుంటోందిపుడు. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా అమ్మడి టాలెంట్ కు ఫిదాఅయ్యి తన నవాడ్ లోనూ తీసుకున్నాడు. 

నవాబ్ లో అదితిరావు హైదరి పార్వతి పాత్రలో కనిపిస్తుంది. అరవింద్ స్వామికి జోడీగా ఉంటుందని పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. మరి ఈ సినిమాలోనూ తనదైన మ్యాజిక్ చూపిస్తుందేమో ఈ బ్యూటీ. అఫ్ కోర్స్ మణిరత్నం కాబట్టి ఆమెను మరోసారి మ్యాజికల్ గానే వాడతాడనుకోవచ్చు..
 

More Related Stories