English   

మ‌హాత్ముడే ల‌క్ష్యంగా విజ‌య్ స‌ర్కార్.. 

Sarkar-audio-release
2018-08-25 17:19:24

మహాత్ముడు అంటే మ‌రో మాట లేకుండా మ‌న‌కు గుర్తొచ్చే పేరు గాంధీ. ఇండియాలో ఆయ‌న్ని త‌ప్ప మ‌రెవ‌ర్ని మ‌హాత్ముడు అన‌డానికి కూడా లేదు. ఇప్పుడు ఈయ‌నే టార్గెట్ చేసుకుని వ‌స్తున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మురుగ దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స‌న్ పిక్చ‌ర్స్ ఏకంగా 100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో స‌ర్కార్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ లెక్కల‌ ప్ర‌కారం చూస్తే.. త‌మిళనాట ర‌జినీకాంత్ త‌ర్వాత విజ‌య్ కే ఆ స్థానం ద‌క్కుతుంది. పైగా ర‌జినీ ఇప్పుడు వ‌ర‌స డిజాస్ట‌ర్స్ ఇస్తున్నాడు కాబ‌ట్టి అన్ అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ కూడా ఇప్పుడు విజ‌యే. మెర్స‌ల్ తో రికార్డుల లెక్క‌ల‌న్నీ తిర‌గ‌రాసాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ అంటూ వ‌స్తున్నాడు విజ‌య్. అక్టోబ‌ర్ 2న గాంధీజ‌యంతి సంద‌ర్భంగా ఈ చిత్ర ఆడియో విడుద‌ల కానుంది. ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

ఇప్ప‌టికే విడుద‌లైన స్టిల్స్ చూస్తుంటే ఈ సారి మాఫియాను టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మైపోతుంది. విజ‌య్-మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. దీనికి ముందు తుపాకిలో స్లీప‌ర్ సెల్స్ గురించి.. క‌త్తిలో రైతుల గురించి చెప్పాడు మురుగదాస్. ఇప్పుడు మాఫియాను ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందులో విజ‌య్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుందంటున్నాడు మురుగ‌దాస్. పైగా స్పైడ‌ర్ త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ మురుగ‌దాస్ ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసింది. ఇప్పుడు క‌చ్చితంగా విజ‌య్ సినిమాతో హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక్క‌డ ఓ సెంటిమెంట్ మురుగ‌దాస్ కు బ‌లాన్నిస్తుంది. క‌త్తి.. తుపాకికి ముందు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు మురుగ‌దాస్. విజ‌య్ తో సినిమా చేసి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న స‌ర్కార్ దీపావ‌ళికి విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. స‌ర్కార్ తో విజ‌య్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో..?

More Related Stories