English   

నర్తనశాల సెన్సార్ టాకేంటీ..?

Nartanasala-censor
2018-08-25 17:43:39

నాగశౌర్య లేటెస్ట్ మూవీ @నర్తనశాల సెన్సార్ పూర్తయింది. కశ్మీరా, యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు. ఛలో వంటి సూపర్ హిట్ తర్వాత తమ సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో శౌర్య చేస్తోన్న సినిమా ఇది. ఛలో మూవీలాగే ఈ చిత్రానికి అదే ఫార్ములా ఫాలో అయ్యారు. విడుదలకు ముందే ఓ ఫుల్ మెలోడియస్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అలాగే కొత్త దర్శకుడు. కొత్త హీరోయిన్(యామిని కాకుండా).. ఇలా ఛలో సెంటిమెంట్ ను ఫాలో అవుతూ చేసిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. అయితే ఆ రోజు విడుదల కావాల్సిన అక్కినేని నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు పోస్ట్ పోన్ కావడం @నర్తనశాలకు కలిసొచ్చే అంశమే.  ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అన్నీ పాజిటివ్ అంశాల మధ్య సినిమాను విడుదల చేయబోతోన్న టీమ్ కు సెన్సార్ సర్టిఫికేషన్ కూడా ప్లస్ అయింది. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీకి ఒక్క కట్ కూడా చెప్పలేదట. కట్స్ లేకపోవడం అంటే సినిమాపై నమ్మకం పెంచినట్టే అనుకుంటోంది టీమ్. మరి ఈ సినిమా కూడా ఛలో స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories