English   

అనుష్క సైలెంట్ కిల్లరా..? 

Anushka-shetty
2018-08-25 19:03:55

భాగమతి తర్వాత మళ్లీ మేకప్ వేసుకోని అనుష్క ఎట్టకేలకు ఓ కొత్త సినిమా ఒప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. అఫ్ కోర్స్ దీనికంటే ముందే గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓసినిమాకు కమిట్ అయింది. కానీ అది ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ కు రాలేదు. ఈ లోగా హీరోయిన్ సెంట్రిక్ గా ఉండే కథల కోసం వెదుకుతోన్న స్వీటీకి ఈ కొత్త కథ బాగా నచ్చిందట. అందుకే వెంటనే యస్ చెప్పిందంటున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి మాజీ స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పకుడిగా ఉన్నాడు. ఈ మూవీకి ‘‘సైలెంట్’’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. అంటే అనుష్క సైలెంట్ కిల్లర్ గా ఉంటుందేమో.. 

కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు, తాప్సీ జంటగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా రూపొందించిన దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. మరి ఈ సినిమాలో హీరోగా నటిస్తోంది ఎవరో తెలుసా..? మాధవన్.. యస్.. ఈ మధ్య డిఫరెంట్ రోల్స్ తో ష్యూర్ హిట్స్ కొడుతోన్న మాధవన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనుష్క సైలెంట్ కిల్లర్  పాత్రలో కాస్త వయలెంట్ గా కనిపిస్తుందని టాక్. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ టాప్ నాచ్ టెక్నీషియన్స్ తో పాటు కొందరు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ఉంటారట. ఏదేమైనా లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నట్టుంది కదూ అనుష్క.

More Related Stories