English   

ప్ర‌భాస్ పెళ్లి.. ఓ డైలీ సీరియ‌ల్..!

Prabhas-Marriage-rumours
2018-08-26 14:22:45

తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ప్ర‌భాస్. వ‌య‌సు 38 వ‌చ్చినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు ఈ హీరో. బాహుబ‌లి త‌ర్వాత ఈయ‌న పెళ్లి పీట‌లు ఎక్కుతాడంటూ వార్త‌లు బాగానే వ‌చ్చాయి. కానీ అది జ‌రగ‌లేదు. ఇప్పుడు బాహుబ‌లి వ‌చ్చి ఏడాది దాటింది. సాహో కూడా స‌గం పూర్త‌యింది.. ఇంకా పెళ్లికి నో అంటూనే ఉన్నాడు ప్ర‌భాస్. కార‌ణం చెప్ప‌డం లేదు కానీ ఇప్ప‌ట్లో తాను పెళ్లి మాత్రం చేసుకోలేన‌ని తెగేసి చెప్పాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఇంట్లో అమ్మాయిని చూస్తున్నారు అనేది కూడా అబ‌ద్ధ‌మ‌ని తేల్చేసాడు. ఈయ‌న ఓకే అంటే ఎంతోమంది అమ్మాయిలు క్యూ క‌డ‌తారు. కానీ ప్ర‌భాస్ మాత్రం నో మ్యారేజ్.. ఓన్లీ మూవీస్ అంటున్నాడు. ప్ర‌స్తుతానికి సాహోపైనే త‌న దృష్టి ఉంద‌ని.. అది పూర్త‌య్యాకే ఏదైనా అంటున్నాడు ఈ హీరో. అయితే ఈ సినిమా త‌ర్వాత రాధాకృష్ణ సినిమా కూడా సిద్ధంగా ఉంది. అప్పుడు అడిగితే రాధా సినిమా అయిపోయిన త‌ర్వాతే పెళ్లి అంటాడేమో..?

ఈ మ‌ధ్యే సాహో ముచ్చ‌ట్ల గురించి మాట్లాడుతూ.. పెళ్లి గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ.. తన వ్యక్తిగత విష‌యాలు బ‌య‌ట చెప్ప‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని చెప్పాడు. చాలామంది త‌నకు ఎఫైర్లు ఉన్నాయ‌ని.. పెళ్లి ఎప్పుడు అవుతుంద‌ని అడుగుతున్నార‌ని.. కానీ అది త‌న ప‌ర్స‌న‌ల్ అని.. అది బ‌య‌ట చెప్ప‌డం అనేది త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. అది మీడియా వారే అర్థం చేసుకోవాల‌న్నాడు ప్ర‌భాస్. అయితే పెళ్లి చేసుకుంటే అందరితో చెప్పే చేసుకుంటాను అంటు ముక్కుసూటిగా సమాధానమిచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర హిందీ వ‌ర్ష‌న్ కోసం ప్ర‌భాసే డ‌బ్బింగ్ చెప్పుకోనున్నాడు. అందుకే హిందీ కూడా నేర్చుకుంటున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టిస్తుంది. 2019 మొద‌ట్లోనే ప్ర‌భాస్ పెళ్లి పీట‌లెక్కుతాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్ర‌భాస్ మాత్రం ఎప్ప‌ట్లాగే నో అనే స‌మాధాన‌మే చెబుతున్నాడు. మ‌రి ఈయ‌న పెళ్లి క‌హానీ ఎప్ప‌టికి క‌థం అవుతుందో చూడాలిక‌..!

More Related Stories