English   

సీతమ్మతో రాజశేఖర్ రొమాన్స్... 

Anjali-Rajasekhar
2018-08-26 15:56:23

యాంగ్రీమేన్ రాజశేఖర్ కెరీర్ కు కొత్త ఊపిరినిచ్చిన సినిమా ‘గరుడవేగ’. ఈ సినిమాతో మళ్లీ తనదైన స్టైల్లో ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఆ ఊపును కంటిన్యూ చేయాలనే డిసైడ్ అయ్యాడు. నిజానికి గరుడవేగకు ముందు విలన్ గా అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా టర్న్ కావడానికి కథలు వింటున్నాడు. కానీ గరుడవేగ మరికొన్ని సినిమాలు హీరోగా చేయొచ్చనే భరోసా ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ఆలోచనకు కాస్త గ్యాప్ ఇచ్చి హీరోగా కథలు విన్నాడు. అలా ‘అఁ’సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథకు ‘కల్కి’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. రాజశేఖర్ ఇమేజ్ కు తగ్గట్టుగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అట ఇది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ మూవీకి మొదట్నుంచీ హీరోయిన్ పెద్ద సమస్యగా మారింది. చాలామందిని అడిగారు. కానీ రాజశేఖర్ తో అంటే అందరూ నో చెప్పారు. చాలామంది వీళ్లు చాయిస్ అనుకున్నవాళ్లు నో చెప్పారట. దీంతో  ఇక ఎవరు ఓకే చెబితే వాళ్లతోనే వెళ్దాం అనుకుందట టీమ్. మొత్తంగా చాలారోజుల అన్వేషణ అనంతరం ఈ కల్కికి హీరోయిన్ దొరికింది. సీతమ్మవాకిట్లో బ్యూటీ రాజోలు పాప అంజలిని సెలెక్ట్ చేశారు. ఇలాంటి కల్ట్ సినిమాల్లో బాగా సూట్ అయ్యే అంజలికి కూడా ఈ కథ నచ్చిందట. అందుకే ఇందులో నటించేందుకు ఒప్పుకుందని టాక్. మరోవైపు ఎలాగూ ఇప్పుడు అమ్మడికి యంగ్ హీరోల సరసన అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. అటు కోలీవుడ్ లోనూ అదే సిట్యుయేషన్. సో.. రాజశేఖర్ తో రొమాన్స్ కు ఓకే చెప్పిందట. అంజలికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే తెలుస్తుంది. 

More Related Stories