English   

బాలీవుడ్ లో క్రిష్ కు అవమానం..?

krish-bollywood
2018-08-26 16:27:23

తెలుగులో మనకున్న ‘మంచి’ దర్శకుల్లో క్రిష్ ఒకడు. వైవిధ్యమైన సినిమాలతో ప్రతి సినిమాతో ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాడు క్రిష్. అందుకే తక్కువ టైమ్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా బాలీవుడ్ కూ వెళ్లాడు. అక్కడ మన ఠాగూర్ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేశాడు. ఈ సినిమా సౌత్ స్థాయి విజయం అక్కడ సాధించలేదు. కానీ దర్శకుడుగా క్రిష్ కు మంచి పేరు వచ్చింది. ఈలోగా తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణితో తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ టైమ్ అండ్ బడ్జెట్ లో బిగ్గెస్ట్ సినిమా తీసి టాప్ మేకర్స్ ను సైతం ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ వందో సినిమాగా వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా చూసే క్రిష్ కు బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ అవకాశం వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ కథ ఆధారంగా వస్తోన్న ఈ మూవీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇతర తారాగణం విషయంలో పెద్దగా ఎవరి పేర్లూ వినిపించడం లేదు. కానీ ఈ సినిమాకు సంబంధించి క్రిష్ కు బాలీవుడ్ పెద్ద అవమానం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ లో మణికర్ణిక షూటింగ్ జరుగుతుండగానే క్రిష్ తెలుగులో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న నందమూరి తారకరామారావు బయోపిక్ కు ఓకే చెప్పాడు. ‘ఎన్టీఆర్’గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఎక్కువ కాన్ సెంట్రేట్ చేశాడు క్రిష్. కానీ నిజానికి మణికర్ణిక యూనిట్ నుంచి క్రిష్ కు పెద్దగా సహకారం లేదట. ఎవరూ ఆయన్నో పెద్ద డైరెక్టర్ గా చూడటం లేదట. ఓ సాధారణ టెక్నీషియన్ గా మాత్రమే చూస్తున్నారట. మరోవైపు ఎవర్నీ లెక్క చేయని కంగనా కూడా క్రిష్ ను ‘లైట్’ తీసుకుంటోందట. కొన్ని సీన్స్ లో అతని ప్రమేయం లేకండానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఇంకా చెబితే కంగనా న్యూ యార్క్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసింది. అక్కడ నేర్చుకున్నదంతా ఇక్కడ ప్రయోగిస్తూ క్రిష్ ను సైడ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే క్రిష్ మణికర్ణిక కంటే ఎన్టీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది మణికర్ణిక. కానీ ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త ఎక్కువే టైమ్ తీసుకుంటుంది. మొత్తంగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలనుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా అవమానాలు జరిగాయనే టాక్ మాత్రం బాలీవుడ్ నుంచి బలంగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.  

More Related Stories